KKR vs PBKS, IPL 2022 LIVE: పంజాబ్‌ కింగ్స్‌ను కిల్‌ చేసిన రసెల్‌ - 8 సిక్సర్లతో వీర విహారం, కోల్‌కతాకు రెండో విజయం

pbks vs kkr live updates: ఐపీఎల్‌ 2022 ఎనిమిదో మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తలపడుతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్‌? ఎవరిది పై చేయి?

ABP Desam Last Updated: 01 Apr 2022 10:40 PM
రసెల్‌ మజిల్‌.. సిక్సర్ల వరదతో కేకేఆర్‌కు రెండో గెలుపు

KKR vs PBKS, IPL 2022 LIVE: 15 ఓవర్లో వరుసగా రెండు బంతుల్ని ఆండ్రీ రసెల్‌ (70) వరుసగా రెండు సిక్సర్లు బాదేసి విజయం అందించాడు. బిల్లింగ్స్‌ (24) అతడికి అండగా నిలిచాడు. 14.3 ఓవర్లకే 138ని ఛేదించేశాడు.

14 ఓవర్లకు కోల్‌కతా 128-4

KKR vs PBKS, IPL 2022 LIVE: అర్షదీప్‌ 14 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో రసెల్‌ (58) ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ బాదేసి హాఫ్‌ సెంచరీ చేసుకున్నాడు. బిల్లింగ్స్‌ (23) అతడికి తోడుగా ఉన్నాడు.

13 ఓవర్లకు కోల్‌కతా 114-4

KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్‌ చాహర్‌ 5 పరుగులు ఇచ్చాడు. బౌండరీలేమీ రాలేదు. రసెల్‌ (46), బిల్లింగ్స్‌ (22) నిలకడగా ఆడారు.

12 ఓవర్లకు కోల్‌కతా 109-4

KKR vs PBKS, IPL 2022 LIVE: ఒడీన్‌ స్మిత్‌కు రసెల్‌ (44) చుక్కలు చూపించాడు. మూడు సిక్సర్లు, ఒక బౌండరీ బాదేశాడు. ఆఖరి బంతికి బిల్లింగ్స్‌ (20) సిక్స్‌ కొట్టాడు. దాంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి.

11 ఓవర్లకు కోల్‌కతా 79-4

KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్‌ చాహర్‌ 6 పరుగులు ఇచ్చాడు. ఆండ్రీ రసెల్‌ (21), బిల్లింగ్స్‌ (14) నిలకడగా ఆడుతున్నారు.

10 ఓవర్లకు కోల్‌కతా 73-4

KKR vs PBKS, IPL 2022 LIVE: హర్‌ప్రీత్‌ బ్రార్‌కు రసెల్‌ (17) తన మజిల్‌ పవర్‌ చూపించాడు. రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. బిల్లింగ్స్‌ (12) అతడికి తోడుగా ఉన్నాడు.

9 ఓవర్లకు కోల్‌కతా 56-4

KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్‌ చాహర్‌ మరోసారి టైట్‌ బౌలింగ్‌ చేశాడు. కేవలం 2 పరుగులే ఇచ్చాడు. బిల్లింగ్స్‌ (11), రసెల్‌ (2) నిలకడగా ఆడుతున్నారు.

8 ఓవర్లకు కోల్‌కతా 54-4

KKR vs PBKS, IPL 2022 LIVE: హర్‌ప్రీత్‌ 3 పరుగులు ఇచ్చాడు. ఆండ్రీ రసెల్‌ (1), బిల్లింగ్స్‌ (10) నిలకడగా ఆడుతున్నాడు.

7 ఓవర్లకు కోల్‌కతా 51-4, రాహుల్‌కు 2 వికెట్లు

KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్‌ చాహర్‌ అద్భుతం చేశాడు. వరుసగా రెండు వికెట్లు తీశాడు. పరుగులేమీ ఇవ్వలేదు. నాలుగో బంతికి శ్రేయస్‌ (26), ఆరో బంతికి నితీశ్ రాణా (0) ఔటయ్యాడు. బిల్లింగ్స్‌ (8) నిలకడగా ఆడుతున్నాడు. 

6 ఓవర్లకు కోల్‌కతా 51-2

KKR vs PBKS, IPL 2022 LIVE: రబాడా 9 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని శ్రేయస్‌ (26) బౌండరీకి పంపించాడు. బిల్లింగ్స్‌ (8) అతడికి తోడుగా ఉన్నాడు.

5 ఓవర్లకు కోల్‌కతా 42-2

KKR vs PBKS, IPL 2022 LIVE: ఒడీన్‌ స్మిత్‌  9 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. మూడో బంతికి వెంకటేశ్‌ అయ్యర్‌ (3)ను ఔట్‌ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (21), శామ్‌ బిల్లింగ్స్‌ (4) చెరో బౌండరీ బాదేశారు.

4 ఓవర్లకు కోల్‌కతా 33-1

KKR vs PBKS, IPL 2022 LIVE: రబాడా 8 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతికి శ్రేయస్‌ (16) బౌండరీకి పంపించాడు. వెంకటేశ్‌ (3) సింగిల్‌ తీశాడు.

3 ఓవర్లకు కోల్‌కతా 25-1

KKR vs PBKS, IPL 2022 LIVE:  అర్షదీప్‌ 11 పరుగులు ఇచ్చాడు. విడ్త్‌ దొరకడంతో ఆఖరి రెండు బంతుల్ని శ్రేయస్‌ అయ్యర్‌ (9) బౌండరీకి పంపించాడు. వెంకటేశ్‌ (2) నిలకడగా ఆడుతున్నాడు.

2 ఓవర్లకు కోల్‌కతా 14-1

KKR vs PBKS, IPL 2022 LIVE: రబాడా 6 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. ఆఖరి బంతిని ఆడబోయిన రహానె (12) స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. వెంకటేశ్‌ (1) క్రీజులో ఉన్నాడు.

1 ఓవర్‌కు కోల్‌కతా 8-0

KKR vs PBKS, IPL 2022 LIVE: అర్షదీప్‌ 8 పరుగులు ఇచ్చాడు. రెండు బౌండరీలు బాది అజింక్య రహానె (8) ఐపీఎల్‌లో 4000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (0) ఇంకా ఖాతా తెరవలేదు.

పంజాబ్‌ 137 ఆలౌట్‌

KKR vs PBKS, IPL 2022 LIVE: ఆండ్రీ రసెల్‌ వేసిన 18.1వ బంతికి రబాడా (25) ఔటయ్యాడు. సౌథీ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత బంతికే అర్షదీప్‌ (0) రనౌట్‌ అయ్యాడు. దాంతో పంజాబ్‌ ఆలౌటైంది.

18 ఓవర్లకు పంజాబ్‌ 137-8

KKR vs PBKS, IPL 2022 LIVE: శివమ్‌ మావి 17 పరుగులు ఇచ్చాడు. రబాడా (25) రెండు బౌండరీలు, స్మిత్‌ (9) ఒక సిక్స్‌ బాదేశాడు.

17 ఓవర్లకు పంజాబ్‌ 120-8

KKR vs PBKS, IPL 2022 LIVE: సౌథీ 16 పరుగులు ఇచ్చాడు. రబాడా (16) వరుసగా 4,4,6 బాదేశాడు. స్మిత్‌ (3) తోడుగా ఉన్నాడు.

15 ఓవర్లకు పంజాబ్‌ 102-8

KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్‌ యాదవ్‌ అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీసి మెయిడిన్‌ ఓవర్‌ వేశాడు. రెండో బంతికి హర్‌ప్రీత్‌ (14), నాలుగో బంతికి రాహుల్‌ చాహర్‌ (0)ను ఔట్‌ చేశాడు. మొత్తంగా తన నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

14 ఓవర్లకు పంజాబ్‌ 102-6

KKR vs PBKS, IPL 2022 LIVE: నరైన్‌ 5 పరుగులు ఇచ్చాడు. ఒడీన్‌ స్మిత్‌ (2), హర్‌ప్రీత్‌ (14) ఆచితూచి ఆడుతున్నారు.

13 ఓవర్లకు పంజాబ్‌ 97-6

KKR vs PBKS, IPL 2022 LIVE: సౌథీ 5 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. నాలుగో బంతిని హర్‌ప్రీత్‌ (12) బౌండరీకి పంపించాడు. ఒడీన్‌  స్మిత్‌ (1) పరుగుల ఖాతా ఆరంభించాడు.

12 ఓవర్లకు పంజాబ్‌ 92-5

KKR vs PBKS, IPL 2022 LIVE: నరైన్‌ బౌలింగ్‌లో 6 పరుగులు వచ్చాయి. తొలి ఐదు బంతులకు హర్‌ప్రీత్‌ (8) ఇబ్బంది పడ్డాడు. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టాడు. షారుఖ్‌ (0) ఇంకా ఖాతా తెరవలేదు.

11 ఓవర్లకు పంజాబ్‌ 86-5

KKR vs PBKS, IPL 2022 LIVE: వరుణ్‌ చక్రవర్తి 1 పరుగే ఇచ్చాడు. షారుఖ్‌ (0), హర్‌ప్రీత్‌ (2) నిలకడగా ఆడుతున్నారు.

10 ఓవర్లకు పంజాబ్‌ 85-5

KKR vs PBKS, IPL 2022 LIVE: సునిల్‌ నరైన్‌ 7 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. మూడో బంతికి రాజ్‌ బవా (11)ను ఔట్‌ చేశాడు. షారుఖ్‌ ఖాన్‌ (0), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (1) క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లకు పంజాబ్‌ 78-4

KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్‌ యాదవ్‌ 8 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టబోయిన లివింగ్‌స్టన్‌ (19) సౌథీకి క్యాచ్‌ ఇచ్చాడు. రాజ్‌ బవా (5) నిలకడగా ఆడుతున్నాడు.

8 ఓవర్లకు పంజాబ్‌ 70-3

KKR vs PBKS, IPL 2022 LIVE: నరైన్‌ వచ్చాడు. 5 పరుగులు ఇచ్చాడు. రాజ్‌ బవా (3), లివింగ్‌స్టన్‌ (14) ఆచితూచి ఆడుతున్నారు.

7 ఓవర్లకు పంజాబ్‌ 65-3

KKR vs PBKS, IPL 2022 LIVE: వరుణ్‌ చక్రవర్తి 3 పరుగులు ఇచ్చాడు. లివింగ్‌స్టన్‌ (12), రాజ్‌ బవా(1) నిలకడగా ఆడుతున్నారు.

6 ఓవర్లకు పంజాబ్‌ 62-3

KKR vs PBKS, IPL 2022 LIVE: టిమ్‌ సౌథీ 11 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఆఫ్‌ సైడ్‌ దూరంగా వేసిన బంతిని ఆడబోయిన శిఖర్‌ ధావన్‌ (16) కీపర్ షెల్డన్‌ జాక్సన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రాజ్‌ బవా(౦), లివింగ్‌స్టన్‌ (10) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

5 ఓవర్లకు పంజాబ్‌ 51-2

KKR vs PBKS, IPL 2022 LIVE: వరుణ్‌ చక్రవర్తి 8 పరుగులు ఇచ్చాడు. ధావన్‌ (12), లివింగ్‌స్టన్‌ (4) నిలకడగా ఆడుతున్నాడు.

4 ఓవర్లకు పంజాబ్‌ 43-2, హ్యాట్రిక్‌ సిక్సర్ల రాజపక్స ఔట్‌

KKR vs PBKS, IPL 2022 LIVE:  శివమ్‌ మావి 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. రాజపక్స (31; 9 బంతుల్లో 3x4, 3x6) వరుసగా 4, 6,6,6 కొట్టాడు. ఆ తర్వాత ఔటయ్యాడు. ధావన్‌ (10) మరో ఎండ్‌లో ఉన్నాడు.

3 ఓవర్లకు పంజాబ్‌ 21-1

KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్‌ యాదవ్‌ 14 పరుగులు ఇచ్చాడు. రాజపక్స (10) బౌండరీ బాదేశాడు. శిఖర్ ధావన్‌ (10) ఒక సిక్సర్‌ కొట్టాడు.

2 ఓవర్లకు పంజాబ్‌ 7-1

KKR vs PBKS, IPL 2022 LIVE: టిమ్‌ సౌథీ 5 పరుగులే ఇచ్చాడు. ఆఖరి బంతికి రాజపక్స (4) బౌండరీ బాదేశాడు. ధావన్‌ (2) క్రీజులో ఉన్నాడు.

1 ఓవర్‌కు పంజాబ్‌ 2-1

KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్‌ యాదవ్‌ అదరగొట్టాడు. 2 పరుగులే ఇచ్చితొలి ఓవర్‌ ఆఖరి బంతికి మయాంక్‌ అగర్వాల్‌ (1)ని ఎల్బీ చేశాడు. శిఖర్‌ ధావన్‌ (1), భానుక రాజపక్స క్రీజులో ఉన్నారు.

కోల్‌కతా జట్టు

KKR vs PBKS, IPL 2022 LIVE: అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్‌ అయ్యర్‌, సామ్‌ బిల్లింగ్స్‌, ఆండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి

పంజాబ్‌ జట్టు

KKR vs PBKS, IPL 2022 LIVE: మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, భానుక రాజపక్స, షారుఖ్‌ ఖాన్‌, ఒడీన్‌ స్మిత్‌, రాజ్‌ బవా, అర్షదీప్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌

పంజాబ్‌పై టాస్‌ గెలిచిన కేకేఆర్‌! ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రేయస్‌

KKR vs PBKS, IPL 2022 LIVE: పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ శ్రేయస్‌ వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇక్కడ గతంలో జరిగిన మ్యాచులో ఛేజింగ్‌ చేసిన జట్టే గెలిచింది.

Background

IPL 2022, PBKS vs KKR: ఐపీఎల్‌ 2022 ఎనిమిదో మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తలపడుతున్నాయి. ఈ మ్యాచుకు వాంఖడే వేదిక. 206 టార్గెట్‌ను ఊడ్చేసిన పంజాబ్‌ జోరు మీదుంటే రెండో మ్యాచులో పరాజయంతో కోల్‌కతాలో పట్టుదల మరింత పెరిగింది. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్‌? ఎవరిపై ఎవరిది పై చేయి? ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు.


KKRదే పైచేయి


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) పంజాబ్‌ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (PBKS vs KKR) తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడగా కేకేఆర్‌ ఏకంగా 19 సార్లు గెలిచింది. పంజాబ్‌ 10 విజయాలకే పరిమితమైంది. రీసెంట్‌గా ఆడిన ఆఖరి ఐదింట్లోనూ 3-2తో కేకేఆర్‌దే పైచేయి. అయితే గతేడాది చెరో మ్యాచ్ గెలిచారు.


 హిట్టర్లదే రాజ్యం!





ప్రస్తుత సీజన్లో రెండు జట్లు బలంగా మారాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. రెండు జట్లలోనూ కావాల్సినంత మంది హిట్టర్లు ఉన్నారు. బెంగళూరుపై 206 టార్గెట్‌ను ఛేదించిన పంజాబ్‌ మంచి జోష్‌లో ఉంది. పైగా ఆ జట్టులోకి ఇప్పుడు కాగిసో రబాడా వచ్చాడు. దాంతో డెత్‌, పవర్‌ప్లే బౌలింగ్‌ మరింత పటిష్ఠంగా మారనుంది. ఒడీన్‌ స్మిత్ వీరబాదుడు ఆకట్టుకుంది. ఇక కేకేఆర్‌ ఒక మ్యాచ్‌ గెలిచి ఒకటి ఓడింది. రెండో మ్యాచులో ముఖ్యంగా ఒకరకమైన నిర్లక్ష్యం కనిపించింది! పిచ్‌, కండీషన్స్‌ను పట్టించుకోకుండా తర్వాత వచ్చేవాళ్లు బలమైనవాళ్లేనని భావించి అనవసర షాట్లు ఆడి బొక్కబోర్లా పడ్డారు. 14 ఓవర్లకే 8 వికెట్లు పోగొట్టుకున్నారు. బహుశా ఈ మ్యాచులో మరింత జాగ్రత్తగా ఆడే అవకాశం ఉంది. వాంఖడేలో టాస్‌ గెలిచిన వారిదే దాదాపుగా గెలుపు కానుంది.




PBKS vs KKR Probable Teams


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌, షెల్డన్‌ జాక్సన్‌, ఆండ్రీ రసెల్‌ / చామిక కరుణరత్నె /మహ్మద్ నబీ, సునిల్‌ నరైన్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి


పంజాబ్‌ కింగ్స్‌: శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, రాజ్‌బావా, షారుఖ్‌ ఖాన్‌, ఓడీన్‌ స్మిత్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, అర్షదీప్‌ సింగ్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.