Andhara police arrested Kodali Nani follower Kali hiding in Assam:  మేము అధికారంలోకి వచ్చాక మీ బతుకు అస్సామే అని గుడివాడ టీడీపీ నేతలు  వైసీపీ నేతల్ని హెచ్చరించారో లేదో కానీ ఆ వైసీపీ లీడర్ మాత్రం ఎందుకైనా మంచిదని ముందుగానే అస్సాం పారిపోయాడు. అక్కడ ఎవరికీ తెలియకుండా గుట్టుగా బతుకుతున్నాడు. కానీ  గుడివాడ పోలీసులు నిఘా పెట్టి అస్సాంలో దాక్కున్నాడని తెలుసుకుని వెళ్లి అరెస్టు చేసి తీసుకుస్తున్నారు. ఆయన పేరు మెరుగుమాల కాళి. 


గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కానీ ఆయన తరపున పనులు చక్కబెట్టేందుకు ప్రధాన అనుచరునిగా మెరుగమాల కాళీ ఉండేవారు. ఈ క్రమంలో ఆయన చాలా నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కొన్ని ఘటనల్లో కేసులు నమోదు అయిన అరెస్టు చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టు చేస్తారన్న  భయంతో ఆయన  ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు గుడివాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన వ్యాపార సంస్థపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఈ కేసులో మెరుగుమాల కాళీ నిందితుడిగా ఉన్నారు.                             


Also Read: Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను



ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఆయనపపై కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. పలు స్కాంలపై ప్రభుత్వం విజిలెన్స్ ఇతర విచారణల్ని జరుపుతోంది. ఆయనను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన సైలెంట్ అయ్యారు. ఆరోగ్యం కూడా అంతగా సహకరించకపోవడంతో ఆయన ఇంటికే పరిమితమవుతున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన స్నేహితుడు గన్నవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా కనిపించడం లేదు. ఆయన కూడా ఆజ్ఞాతంలో ఉన్నారు.                                  



Also Read: Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా