Tips for a Healthy Diet and Strong Immunity for Kids : న్యూ ఇయర్, న్యూ రొటీన్. ఇది కేవలం పెద్దలకే కాదు. పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే పిల్లలు హెల్తీగా ఉండేందుకు, ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు వారికి కొన్ని హెల్తీ అలవాట్లు నేర్పించాలంటున్నారు నిపుణులు. అయితే ఎలాంటి అలవాట్లు పిల్లలకు చేస్తే మంచిది. వారి రొటీన్​ని పేరెంట్స్ ఎలా డిజైన్ చేయాలి? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం. 


పిల్లలకు సరైన లైఫ్​స్టైల్, హెల్తీ రొటీన్ లేకుంటే వారు త్వరగా సిక్ అవుతారు. ముఖ్యంగా వారిలో రోగనిరోధక శక్తి తగ్గితే జబ్బులు త్వరగా వస్తాయి. అంతే త్వరగా వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలను హెల్తీగా ఉంచడంలో, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో, శారీరకంగా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేసే టిప్స్​ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. 


హెల్తీ డైట్


పిల్లలకు కచ్చితంగా ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ని అలవాటు చేయాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, ప్రోటీన్స్, తృణధాన్యాలతో కూడిన డైట్​ని పోషకనిపుణుల సహాయంతో ప్రిపేర్ చేయాలి. సిట్రస్ ఫ్రూట్స్​లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి వారికి హెల్తీ స్నాక్​గా వీటిని ఇవ్వొచ్చు. క్యారెట్లు, పాలకూర, యోగర్ట్ వంటి వాటిలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 


ఫిజికల్ యాక్టివిటీ.. 


పిల్లలను శారీరకంగా యాక్టివ్​గా ఉండేలా పేరెంట్స్​ రొటీన్​ను సెట్ చేయాలి. వారు స్పోర్ట్స్​పై, రన్నింగ్, సైక్లింగ్ వంటివాటిపై మొగ్గుచూపేలా చేయాలి. స్పోర్ట్స్ అంటే మొబైల్ గేమ్స్ కాకుండా.. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ వంటి ఫిజికల్ యాక్టివిటీని పెంచే వాటిపై దృష్టి పెట్టాలి. అలాగే స్విమ్మింగ్ కుడా మంచిది. ఫిజికల్​గా యాక్టివ్​గా ఉంటే ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా.. మానసికంగా కూడా పిల్లలు హెల్తీగా ఉంటారు. 


హైడ్రేషన్.. 


పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా మంచినీళ్లు ఓ వరమని చెప్పొచ్చు. పిల్లలు వీలైనంత ఎక్కువ నీళ్లు తాగేలా చూడడం పేరెంట్స్ బాధ్యతే. నీటితో పాటు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్​లు, సూప్​లు, కొబ్బరి నీళ్లు ఇవ్వొచ్చు. ఇవి హైడ్రేటెడ్​గా ఉండడంలో హెల్ప్ చేసి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. 


నిద్ర ఎంత ఉండాలంటే.. 


పెద్దలకంటే పిల్లలకు ఎక్కువ నిద్ర ఉండాలి. కనీసం 9 నుంచి 12 గంటల నిద్ర పిల్లలకు ఉండేలా చూసుకోవాలి. మంచి నిద్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వయసు పెరిగే కొద్ది నిద్ర ఎలాగో తగ్గుతుంది కాబట్టి.. పిల్లలకు వయసువారీగా నిద్ర ఎంత ఉండాలో నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. దానిప్రకారం వారి స్లీపింగ్ షెడ్యూల్​ని ప్లాన్ చేసుకోవచ్చు. 


ఆ అలవాట్లు నేర్పండి.. 


పిల్లలు ఏ పని చేసినా.. చేతులు కడుక్కోవాలని నేర్పించండి. ముఖ్యంగా భోజనానికి ముందు, భోజనం తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పేరెంట్స్ చెప్పాలి. అలాగే వాష్ రూమ్ ఉపయోగించిన తర్వాత కూడా ఈ రొటీన్ ఫాలో అవ్వాలని సూచించాలి. దగ్గు, తుమ్మే సమయంలో చేతిని ముఖానికి అడ్డుగా ఉంచుకోవాలని నేర్పించండి. జలుబు సమయంలో టిష్యూ వాడడం, దగ్గు వచ్చినప్పుడు మోచీతిని అడ్డుపెట్టుకోవడం వంటివి నేర్పిస్తే మంచిది. 


వ్యాక్సినేషన్స్


పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్స్ వేయించారో లేదో తరచూ చెక్ చేసుకుంటే మంచిది. ఇవి కొన్ని వ్యాధులు పిల్లలపై అటాక్ చేయకుండా చేస్తాయి. సీజనల్​ వ్యాధులను దూరం చేస్తాయి. కాబ్టటి పిల్లలకు ఏ వయసులో ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలో వైద్యుల సలహాలు తీసుకోండి.


జంక్ ఫుడ్ 


పిల్లలు జంక్ ఫుడ్, చాక్లెట్లు, స్వీట్స్ ఎక్కువగా తింటారు. కాబట్టి వారికి హెల్తీగా స్వీట్స్, చాక్లెట్లు చేసి ఇవ్వొచ్చు. డ్రై ఫ్రూట్స్, కర్జూరంతో చేసే ఎన్నో స్వీట్స్​ని ఇంట్లోనే చేసి పెట్టొచ్చి ఇవి హెల్తీ కూడా. అలాగే స్నాక్స్​గా డ్రై రోస్ట్ చేసిన నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఇవ్వొచ్చు. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. 



ఈ తరహా హెల్తీ రొటీన్​ను పిల్లలకు అలవాటు చేస్తే.. వారు కచ్చితంగా స్ట్రాంగ్​గా మారుతారు. అంతేకాకుండా చిన్ననాటి నుంచే వారికి ఓ హెల్తీ లైఫ్​స్టైల్ అలవాటు అవుతుందని చెప్తున్నారు నిపుణులు. 


Also Read : న్యూ ఇయర్ 2025 ఫిట్​నెస్ గోల్స్.. బరువును తగ్గించి, ఫిట్​గా ఉంచగలిగే సింపుల్ టిప్స్ ఇవే