నట సింహం బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'అన్ స్టాపబుల్ సీజన్ 4' (Unstoppable With NBK 4) సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల సెలబ్రెటీలు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా బాలయ్య నటిస్తున్న 'డాకు మహారాజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా, టీం షోలో హడావిడి చేసిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేశారు.
'అన్ స్టాపబుల్ సీజన్ 4'లో 'డాకు మహారాజ్' టీం సందడి
తాజాగా 'అన్ స్టాపబుల్ సీజన్ 4' ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు ఆహా వారు. ఈ ప్రోమోలో 'డాకు మహారాజ్' ఆర్మీ తమన్, బాబి, నిర్మాత నాగ వంశీ ఇందులో గెస్టులుగా హాజరయ్యారు. ఇక బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అక్కడే ఉన్నారు. ఈ ప్రోమోలో ముందుగా "ఏం డైరెక్టర్ గారు చొక్కా మీద చొక్కా వేశారు?" అంటూ బాబీని, స్పెషల్ ఎఫెక్ట్ తో తమన్ ను, తరువాత నిర్మాత నాగవంశీని ఆహ్వానించారు. షోలో భాగంగా "ఫస్ట్ టైం థియేటర్లలో స్పీకర్లు తగలబడిపోయింది మీ సినిమాకే" అని తమన్ చెప్పిన డైలాగ్, "మీ స్పీకర్ల కెపాసిటీని పెంచుకో... డాకు మహారాజ్ వస్తోంది, వెదర్ అదోలా ఉంది సిట్టింగ్ వేద్దామా?" అని బాలయ్య చెప్పిన డైలాగ్ లు హైలెట్ గా నిలిచాయి. తమన్ "నీ గురించి చాలా విన్నాను, ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నాను. నీకు అనుష్క అంటే చాలా ఇష్టం కదా ?" అని బాలయ్య అడగ్గా, సిగ్గు పడుతూ "అవును" అన్నారు తమన్.
రష్మిక - విజయ్ దేవరకొండల పెళ్లి ప్రస్తావన
బాలయ్య మాట్లాడుతూ "నాకు రష్మిక అంటే ఇష్టం. పెళ్లి ఫిక్స్ అయినట్టు ఉంది కదా?" అని నిర్మాత నాగ వంశీని ప్రశ్నించారు. "తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు. కానీ ఎవరిని, ఎప్పుడు అనేది తెలీదు" అని చెప్పారు నాగ వంశీ. "చెప్పమ్మా కొంచెం లీకులు ఇద్దాము" అంటూ బాలయ్య ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. "ఊర్వశి రౌతెల మీద మీ అభిప్రాయం ఏంటమ్మా?" అంటూ నాగవంశీని ఇరికించారు. దానికి నాగ వంశీ తెలివిగా "ఆ విషయం చెప్తే మా ఆవిడ విడాకులు ఇస్తుంది సార్" అని చెప్పి తప్పించుకున్నాడు.
"నీ ప్రేమ కథ గురించి కొంచెం చెప్పమ్మా" అంటూ బాబీని అడిగారు. ఆయన ఏం చెప్పాడనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు. కానీ బాగా యాక్ట్ చేస్తున్నాడు అంటూ ఆట పట్టించారు 'డాకు మహారాజ్' టీం. "నీకు ఎక్కడో కాలితే, ఎవరినో లాగి కొట్టావు. సినిమా ఇండస్ట్రీ వాడేనా?" అని నాగవంశీని అడిగారు బాలయ్య. ఆ తర్వాత ఆయనే "ఓరి దుర్మార్గుల్లారా మీ కంటే నేనే బెటర్" అన్నారు.
బాలయ్య కుర్చీకే ఎసరు
షో లో భాగంగా "రష్మిక, మీనాక్షి చౌదరిలలో ఎవరు ఇష్టం?" అని బాలయ్యను ప్రశ్నించారు తమన్. "ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడం ఇష్టమా, మాన్షన్ హౌస్ తో రిలాక్స్ అవ్వడం ఇష్టమా?" అని ప్రశ్నించారు బాబి. దానికి బాలయ్య సరదాగా స్పందిస్తూ "డే ఒకరిని, నైట్ ఒకరిని ప్రేమిస్తా" అని చెప్పారు.
తమన్ ను ఇరికించిన బాలయ్య
ప్రగ్యా జైస్వాల్ కి కాల్ చేసి తమన్ ఇక్కడే ఉన్నాడంటూ చెప్పాడు బాలయ్య. దానికి ఆమె ఇచ్చిన రెస్పాన్స్ హైలెట్ గా మారింది. దీంతో బాలయ్య, నాగ వంశీ... వీరిద్దరి మధ్య ఏదో ఉందన్నట్టుగా ఆట పట్టించారు. ఆ తర్వాత ఆటపాటలతో ఇంట్రెస్టింగ్ గా సాగింది ప్రోమో. 'డాకు మహారాజ్' అన్ స్టాపబుల్ ఎనర్జీని చూపించే ఎపిసోడ్ 8 ని చూడాలంటే జనవరి 3 రాత్రి 7 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే.