మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఓవైపు 'మార్కో' మూవీ తెలుగులో రిలీజ్ రెడీ అవుతుంటే, మరోవైపు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అనే చర్చ మొదలైంది. అలా ఎదురు చూస్తున్న వాళ్ళ కోసమే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.
'మార్కో' ఎప్పుడు, ఏ ఓటీటీలో?
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'మార్కో'లో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. ఇందులో సిద్ధిక్ జార్జ్, జగదీష్, అన్సన్ పాల్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 'మార్కో' మూవీకి హనీఫ్ దర్శకత్వం వహించారు. తాజాగా సోషల్ మీడియాలో నడుస్తున్న బజ్ ప్రకారం... 'మార్కో' మూవీ కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషలలో ఒకేసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.
'మార్కో' మూవీ ఓటీటీ రైట్స్ ని దిగ్గజ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం 'మార్కో' మూవీ 45 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అంటే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. 'మార్కో' ఓటీటీ వెర్షన్ లో ఎక్స్ట్రా రన్ టైం యాడ్ చేసి, రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. థియేటర్ వెర్షన్ లో కట్ చేసిన సీన్స్ ను ఓటీటీ వెర్షన్ కు యాడ్ చేసి, రిలీజ్ చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది.
తెలుగులో 'మార్కో' రిలీజ్
'మార్కో' మూవీ డిసెంబర్ 20న మలయాళం భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇప్పటిదాకా ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రాలేదు. మలయాళంలో ఈ మూవీకి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండడంతో తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా తెలుగులో 'మార్కో' మూవీ థియేటర్లలోకి రాబోతోంది.
Also Read: ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
తగ్గేదేలే అంటున్న 'మార్కో'
మలయాళంలో 'మార్కో' మూవీ గత వారం రిలీజ్ అయిన ఈ మూవీ భారీ పోటీని తట్టుకుని, హిట్ మూవీగా నిలబడింది. ఈ మూవీకి అప్పటికే 'విడుదల పార్ట్ 2', 'యూఐ' వంటి సినిమాలతో భారీ పోటీ నెలకొంది. అయినప్పటికీ 'మార్కో' మూవీ థియేటర్లలో తగ్గేదే లే అంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్ కైతే టాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి 'మార్కో'కి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.