టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) చేసే కామెంట్స్ ఎప్పుడూ సూటిగా సుత్తి లేకుండా ఉంటాయన్న విషయం తెలిసిందే. నాగ వంశీ తాను అనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor)కు నాగవంశీ ఇచ్చిపడేశారు.


చిన్నబోయిన బోనీ కపూర్


ఆయన వ్యవహార శైలి వల్ల ఇప్పటికే ఎన్నోసార్లు ట్రోలింగ్ ను కూడా ఎదుర్కొన్నారు. కానీ నాగ వంశీ వాటిని ఏమాత్రం పట్టించుకోరు. ఆయన నిర్మించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రత్యేకంగా ప్రమోషనల్ కంటెంట్ అవసరం ఉండదు. తన స్టేట్మెంట్స్ తోనే మూవీపై హైప్ ను ఓ రేంజ్ లో పెంచేస్తారు. అలాంటి ఈ క్రేజీ ప్రొడ్యూసర్ తో డిబేట్ అంటే మామూలుగా ఉండదు మరి. తాజాగా బోనీ కపూర్ తో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాగ వంశీ సౌత్ సినిమాల సత్తా గురించి మాట్లాడాడు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో సౌత్ సినిమాల విజయం పరంపర గురించి మాటలు కలిపాడు. కానీ హార్ష్ రియాలిటీ అంటూ నాగ వంశీ చేసిన కామెంట్స్ తో బోనీ కపూర్ చిన్నబోయాడు.






బోనీకి నాగ వంశీ కౌంటర్ 


తెలుగు ఇండస్ట్రీ రాజమౌళి లాంటి దర్శకుల చేతులు పడిన తర్వాత ఎంతలా కీర్తిని గడించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనుడు రాజమౌళి. ఆ తర్వాత వచ్చిన 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'యానిమల్' బాలీవుడ్ తో పాటు పలు దేశాలలో బాక్స్ ఆఫీసును షేక్ చేశాయి. బాలీవుడ్ పెద్ద సినిమాలు కూడా ఈ సినిమాల ముందర బోల్తా కొట్టాయి. తాజాగా బాలీవుడ్ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగవంశీ తనదైన స్టైల్ లో సౌత్ సినిమాల గొప్పతనం గురించి మాట్లాడాడు.


నాగ వంశీ "హార్ష్ రియాలిటీ" అంటూ మొదలు పెట్టారు. ఆయన మాట్లాడుతూ "హర్ష్ గా ఉన్నా మీరిది ఒప్పుకోవాల్సిన ట్రూత్. బాలీవుడ్ వాళ్ళకు మా సౌత్ వాళ్ళు సినిమాలు ఎలా తీయాలో నేర్పిస్తున్నారు. మీరు మాత్రం ఇంకా సినిమాలు తీయడంలో బాంద్రా, జుహు దగ్గరే ఆగిపోయారు. మేము మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి, పుష్ప, యానిమల్ వంటి సినిమాలు తీశాము" అన్నారు. బోనీ కపూర్ దీనికి ఒప్పుకోకుండా "అలాంటి సినిమాలను మేము ఎప్పుడో తీశాము" అని అన్నారు. నాగవంశీ మళ్లీ అందుకుని "సౌత్ నుంచి వచ్చిన భారీ సినిమాలన్నీ కూడా నార్త్ లో భారీ కలెక్షన్లు రాబట్టాయి కదా" అని కౌంటర్ వేశారు. అక్కడితో డిస్కషన్ అయిపోలేదు. బోనీ కంటిన్యూ చేస్తూ "గదర్ 2, పఠాన్, జవాన్ ను మర్చిపోయావ్" అన్నారు. నాగ వంశీ ఊరుకుంటారా ? "జవాన్ ను తీసింది సౌత్ వాడే కదా" అని మరోసారి కౌంటర్ వేశారు. అంతేకాదు "పుష్ప 2 ఒక్క హిందీలోనే ఒక్క రోజులోనే రూ.86 కోట్లు రాబట్టింది అన్నప్పుడు మీ ముంబై వాళ్ళకి నిద్ర కూడా పట్టి ఉండదు" అంటూ ఇచ్చిపడేశాడు నాగవంశీ.



Also Read : Most Handsome Man in the Worldగా ఎన్నికైనా BTS V.. కిమ్ టేహ్యూంగ్ తర్వాత లిస్ట్​లో ఉన్నది ఎవరంటే