New Zealand has stepped into 2025 before any other country in the world: భారత్‌లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 దాటగానే కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం మొదలైపోయింది. న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భారతీయ కాలమాన ప్రకారం 4.30 గంటలకు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలయ్యింది. అంతకు ముందే కిరిబాటి అనే దీవిలో మొదటగా న్యూయర్ వచ్చింది.
అద్భుతమైన ఫైర్‌వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు.
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా తర్వాత చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లో కు, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియాలో న్యూయర్ ముందుగా జరుపుకుంటారు.
భారత్ తర్వాత 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.
చివరిగా మాత్రం అమెరికా న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతుంది.