Today Top Headlines In Ap And Telangana:
1. రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా మాజీ మంత్రి
గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. బియ్యం మాయం కావడంపై నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఇదివరకే కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పేర్ని నాని ఏపీ హైకోర్టులోలంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇంకా చదవండి.
2. యల్లమందలో లబ్ధిదారునికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం
కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు. ఉదయం 11.30కి ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు 12 గంటలకు యల్లమందకు చేరుకున్నారు. మండలంలోని యల్లమంద గ్రామంలో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేల పింఛన్ లబ్ధిదారుకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. ఇంకా చదవండి.
3. పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సైపై దాడి
ప్రజలకు అండగా నిలిచే పోలీసులపై దాడులు చేస్తున్నారు. శాంతి, భద్రతలను రక్షించే లక్ష్యంతో పని చేస్తోన్న వారిపై దారుణానికి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ మఫ్టీలో ఉన్న ఎస్ఐ పై దాడి జరిగింది. డిసెంబర్ 29న జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. స్టేషన్ లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్టేషన్ లో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్థరాత్రి రాజుపాళేనికి చెందిన లింగమయ్య, అతని బంధువులు దాడి చేశారు. ఇంకా చదవండి.
4. మరో వివాదంలో మంచు విష్ణు
మంచు ఫ్యామిలీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలి కాలంలో వీరి ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కి.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకూ వెళ్లిన వీళ్ల గొడవకు సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మరోపక్క ఓ జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేయడంతో.. ఆయనపపై కేసు నమోదు చేశారు. ఆ మధ్యలో విదేశాలకు వెళ్లొచ్చిన ఆయన తిరుపతిలో ఉన్నానని చెప్పి సైలెంట్ అయ్యారు. ఇక తాజాగా మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంకా చదవండి.
5. చోరీకి వచ్చి ఫుల్లుగా తాగి పడుకున్నాడు
దొంగతనం చేయడం కూడా ఒక ఆర్ట్ అన్న పదం ఊరికే అనలేదు. ఎందుకంటే దొంగతనం కన్నా ముందు అది ఎలా చేయాలి, ఏ టైప్ టెక్నిక్స్ వాడాలి, ఎలా ఎస్కేప్ కావాలి అని పక్కా ప్రణాళిక చేయాలి. ఎంత ప్లాన్ చేసిన కొన్నిసార్లు అది తిప్పికొట్టొచ్చు. కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి ఒక్కోసారి. కొందరు దొంగతనం చేసి, అక్కడే పడుకోవడం లాంటి ఘటనలు ఇప్పటికే చూసి ఉంటాం. అదే తరహాలో మద్యం దుకాణంలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ.. ఫుల్లుగా తాగి అక్కడే పడుకున్నాడు. ఇంకా చదవండి.