KTR got a shock in the high court: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని తెలిపారు.
కేటీఆర్ తరపున వాదనలు ఏమిటంటే ?
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ్ దావే వాదనలు వినిపించారు. కేటీఆర్ వేసిన కాష్ పిటిషన్ పై ఏసీబీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కౌంటర్ లో ఏసీబీ కోరింది. అదే సమయంలో నాట్ టు టు అరెస్ట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్ కూడా తన వాదనలు వినాలని కోరారు. డబ్బులు చేరిన సంస్థ ను నిందితుడిగా చేర్చలేదని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చవచ్చు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదని.. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసామమన్నారు.
కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారని.. అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ ను విదేశీ సంస్థకు పంపడం, అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేయడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే చెల్లింపులు చేయడం, FEO కు రెండు విడుతల్లో చెల్లించిన నిధులు ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపమలు చేశారన్నారు. నిధులు చేరిన FEO ను మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదని.. ఇక్కడ దర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో FIR లో ఎక్కడ చెప్పలేదన్నారు. డిసెంబర్ 18 సాయంత్రం 5:30కి కంపిటేoట్ అదారిటీ నుండి ఏసీబీ కి అనుమతి వచ్చింది.. డిసెంబర్ 19న ఏసీబీ FIR నమోదు చేసిందని ఇది కుట్రపూరితంగ ాజరిగిందన్నారు.
అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ ఫైల్ పై సంతకం చేశారు, అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా అని ప్రశఅనించారు. విదేశీ సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ తరపు లాయర్ ప్రశ్నించారు.
ప్రభుత్వం తరపు వాదనలు ఏమిటంటే ..
FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు. రూ. 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారన్నారు. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ...ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామనికేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ఏజీ కోర్టు తెలిపారు.