Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, లక్ష్మీ, జయదేవ్‌లు సమ్మె దగ్గరకు వెళ్తారు. మిత్ర వాళ్లతో మాట్లాడుతానని అంటాడు. గాయపడిన వ్యక్తి బాగానే ఉన్నాడు సమ్మె ఆపండి అని అంటాడు. దానికి మనీషా మనిషి అయిన యూనియన్ లీడర్ పాత మెషిన్స్‌తో మాకు ఇబ్బంది అని అంటాడు. దానికి మిత్ర అన్నీ కొత్త మెషిన్స్‌నే కదా పాత మెషిన్స్ ఎక్కడున్నాయి. మీరు సమ్మె చేస్తే ఫ్యాక్టరీలో సరుకు పోతుందని అంటాడు. దానికి యూనియన్ లీడర్ మన కంటే సరుకు గురించే ఆలోచిస్తున్నారని చెప్తాడు. దాంతో మీడియా కూడా లక్ష్మీ వాళ్ల మీద నెగిటివ్‌గా మాట్లాడుతుంది.


లక్ష్మీ అక్కడున్న ఓ పెద్దాయనతో బాబాయ్ గారు మా మామయ్య ఫ్యాక్టరీ కట్టినప్పుడు నుంచి ఉన్నారు ఏమైనా ఉంటే మనం మనం మాట్లాడుకుందాం ఇదంతా మన ఫ్యామిలీ కదా మీడియా వాళ్లకి ఎందుకు అని అంటుంది. దాంతో ఆ పెద్దాయన లక్ష్మీ చెప్పింది నిజం అని మేడంతో మాట్లాడు వీధిన పడటం ఎందుకు అని అంటారు. లక్ష్మీ యూనియన్ లీడర్‌తో పర్సనల్‌గా మాట్లాడాలి అని లోపలికి తీసుకెళ్తుంది. ఇక సరయు పీఏ రాజుకి కాల్ వస్తుంది. కాల్‌ మాట్లాడి ఆయన షాక్ అవుతారు. మనీషా, సరయు ఏమైందని అడిగితే యూనియన్ లీడర్‌తో లక్ష్మీ మాట్లాడటానికి వెళ్లిందని చెప్తారు.. వాళ్లని లక్ష్మీ ఒప్పిస్తే మనకే నష్టమని అనుకుంటారు. ఇక యూనియన్ లీడర్ బుగ్గన చేయి వేసుకొని వస్తాడు. చెంప మొత్తం వాచిపోయి ఉంటుంది.. యూనియన్ లీడర్ కోపంగా ఈ సమ్మె ఆగదు అని అంటాడు. ఇక రాజు గారు యూనియన్‌ లీడర్‌కి కాల్ చేస్తాడు. మనీషా ఆయనతో మాట్లాడుతుంది. లోపల లక్ష్మీ యూనియన్ లీడర్‌ని కొడుతుంది. మనీషా, సరయు షాక్ అవుతారు. తాము చెప్పే వరకు సమ్మె ఆపొద్దని చెప్తుంది. లక్ష్మీ ఎందుకు అలా చేసిందని అనుకుంటారు. లక్ష్మీ అలా చేయడం వెనక ఏదో కారణం ఉందని అనుకుంటారు. 


జాను వివేక్ దగ్గరకు వెళ్లి లక్ష్మీ సమ్మె ఆపలేకపోయిందని తనకు అంత సీన్ లేదు అని చెప్తుంది. దాంతో వివేక్ నువ్వు ఆపగలవా అని అడుగుతాడు. ఇచ్చి చూడండి అని జాను అంటే అసలు ఆ ఫ్యాక్టరీలో ఏం తయారవుతుంది.. ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటాడు. పెద్దమ్మ లక్ష్మీకి ఊరికే ఛైర్మన్ పదవి ఇవ్వలేదని, మిత్ర ఊరికే చూస్తూ ఉండిపోలేదని తనకు అన్నీ ముందే తెలుసు కాబట్టి ఆ పదవి ఇచ్చిందని చెప్తాడు. మీ అక్క కంటే ఎక్కువ చదివాను అన్నావ్ కానీ మీ అక్కని చదవలేకపోయావ్ అని వివేక్ భార్య మీద కోప్పడతాడు. ఇక లక్ష్మీకి అరవింద ఛైర్మన్ పదవి ఇవ్వడానికి ముందు రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా అని జానుకి అడిగి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు.. ఆరోజు ఏం జరిగింది అంటే.. లక్ష్మీ దగ్గరకు వివేక్ వెళ్లి కంపెనీ గురించి చెప్పాలని అంటే ఇక లక్ష్మీనే రివర్స్‌లో ఎన్ని కంపెనీలు ఏం బిజినెస్‌లు ఉన్నాయో అన్నీంటి గురించి మొత్తం చెప్తుంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని వివేక్ అడిగితే కోడలిగా వచ్చినప్పటి నుంచి మొత్తం తెలుసుకున్నా అని చెప్తుంది. ఆ విషయం చెప్పి మీ అక్క గురించి నీకు ఏం తెలీదు మీ అక్క గురించి నేను నీకు చెప్పాల్సి రావడం నా దురదృష్టం అని అంటాడు.


ఇక సాయంత్రం పిల్లలు ఇంటికి వస్తారు. అమ్మా అమ్మ అని పిలుస్తారు. లక్కీ ఆకలి అని చెప్తే జున్ను బిస్కెట్స్ ఇస్తా అని చూసే సరికి బిస్కెట్స్ ఉండవు. దాంతో లక్కీ ఇంట్లో ఎవరినైనా అడుగుదామనుకుంటే తిడతారని ఆగిపోతారు. దాంతో జున్ను కిచెన్ లోకి వెళ్లి మ్యాగీ చేస్తాడు. అదంతా దేవయాని చూస్తుంది. ఇంతలో మనీషా వచ్చి లక్ష్మీ యూనియన్ లీడర్‌ని కొట్టిందని ప్లాన్ వేస్తే అయిందని అంటుంది. ఇంతలో జున్ను చేయి కాలిపోతుంది. జాను వచ్చే టైంకి దేవయాని కాలు మనీషా తొక్కుతుంది. దాంతో జాను రావడంతో దేవయానికి గాయం అయిందని చెప్తుంది. పిల్లలు ఇద్దరూ స్నాక్స్ తింటారు. ఇంతలో లక్ష్మీ వాళ్లు ఇంటికి వస్తారు. జున్ను చేతి గాయం చూస్తారు. ఏమైందని అడిగితే స్నాక్స్ లేకపోవడంతో తన కోసం జున్ను మ్యాగీ చేస్తుంటే చేయి కాలిందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్య ఎనౌన్స్‌మెంట్‌కి ఫ్యామిలీ ఫ్యూజులు అవుట్.. క్రిష్ చేతకాని వాడంటూ విరుచుకుపడ్డ భైరవి!