Tiger Spotted in Nirmal District: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో చిరుత పులి సంచారం, స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు

Nirmal News | కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న నిర్మల్ జిల్లాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత దాడి చేస్తుందేమోనని దిలావర్ పూర్ మండల వాసులు భయపడుతున్నారు.

Continues below advertisement

Tiger Spotted In Nirmal District | నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. భైంసా-నిర్మల్ జాతీయ రహదారి పై కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చిరుత వాహనదారులకు కనిపించింది. అటుగా వెళుతున్న ప్రయాణికులు చిరుత సంచారాన్ని వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అటువైపుగా వెళ్లే రైతులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని దిలావర్ పూర్ పోలీసులు తెలిపారు.

Continues below advertisement

గతంలోనూ పులి సంచారంతో భయం భయం 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయి. మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీ అటవీ ప్రాంతంలో సంచరించిన చిరుతపులి సీసీటీవీ కెమెరా ట్రాప్ లో రికార్డు అయ్యింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్-కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారి 363 పై రోడ్డు దాటుతుండగా చిరుతపులి కనిపించింది. జాతీయ రహదారిపై వాహనదారులు చిరుతపులిని వీడియో తీశారు. రెబ్బెన మండలం అమీన్ పూర్ గ్రామ అడవుల్లో కొద్దిరోజుల కిందట చిరుతపులి అడవి పందిని చంపింది. అయితే అది పులి అని స్థానికులు భావించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పాదముద్రలు సేకరించాక అటవీశాఖ అధికారులు దానిని చిరుతపులి అని స్పష్టం చేశారు.

ఇటీవల గొర్రెల మందపై చిరుత దాడి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపెల్లి, గుడిపేట గ్రామాల మధ్య అక్టోబర్ 29వ తేదీన రాత్రి గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెలను చంపింది. ఇలా మరి జిల్లాలో ఓవైపు పెద్దపులులు మరోవైపు చిరుతపులులు సంచరిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. దిలావర్పూర్ శివారులో కొంతమేర రిజర్వ్ ఫారెస్ట్ ఉండగా ఆ ప్రాంత సరిహద్దులో మహారాష్ట్ర సరిహద్దు మీదుగా ఈ ప్రాంతాల్లోకి చిరుతలు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల దాడిలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడి చికిత్స పొందారు.

Also Read: Theft in Wine Shop : దొంగతనానికి వచ్చి వైన్ షాపులో ఫుల్లుగా తాగి, పడుకున్న దొంగ

Continues below advertisement