సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. దీంతోపాటు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఒక పాయింట్ కూడా కట్ చేశారు. ఈ విషయాన్ని ఐసీసీ శుక్రవారం తెలిపింది. టైమ్ అలవెన్సులు కూడా అమలు చేసినప్పటికీ.. భారత్ అప్పటికి ఒక ఓవర్ తక్కువగా వేసినందున ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండ్రూ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


‘దీంతోపాటు ఐసీసీ పురుషుల టెస్టు చాంపియన్ షిప్ ఆర్టికల్ 16.11 ప్రకారం.. తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్ తగ్గిస్తారు. దీంతో భారత్‌కు ఒక పాయింట్ కోత పడింది.’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. విరాట్ కోహ్లీ దీనికి ఒప్పుకోవడంతో.. ప్రాథమిక విచారణ కూడా జరగకుండానే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.


అంపైర్లు మరైస్ ఎరాస్మస్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అల్లాహుద్దీన్ పాలేకర్, బొంగని జీలీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టీమిండియా ఈ మ్యాచ్‌ను 113 పరుగుల తేడాతో గెలుచుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది.




Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్‌!


Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?


Also Read: IND vs SA: ద్రవిడ్‌ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!


Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!


Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్‌, కోహ్లీ ప్రశంసలు