ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా టిక్కెట్ల వివాదంపై తొలి సారి స్పందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వృద్ధాప్య పెన్షన్లను రూ. 2250 నుంచి రూ.2,500  పెంచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన జగన్ టిక్కెట్ రేట్ల ప్రస్తావన తీసుకు వచ్చారు. పేదలకు సినిమాను  చేరువ చేయడం కోసం టిక్కెట్ రేట్లను తగ్గించామని ప్రకటించారు. పేదలకు సినిమాను అందుబాటులోకి తెస్తూంటే కొంత మంది విమర్శిస్తున్నారని... అలాంటి వారంతా పేదలకు శత్రువులే అని స్పష్టం చేశారు.


Also Read: ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ తొలి భేటీ వాయిదా !


గత ఏడాది ఏప్రిల్‌లో జీవో నెం.35ను విడుదల చేసిన ప్రభుత్వం టిక్కెట్ రేట్లను అత్యంత తక్కువగా ఖరారు చేసింది. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ ఇతర కారణాల వల్ల ధియేటర్లు పెద్దగా తెరుచుకోలేదు. ఇటీవల ధియేటర్లు తెరుచుకున్నాయి. పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో మళ్లీ టిక్కెట్ రేట్ల అంశం తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా తాము చెప్పిన ధరకే అమ్మాలని ప్రభుత్వం తేల్చేయడంతో ధియేటర్ల యజమానులు నిర్వహణ చార్జీలు కూడా రావని మూసేస్తున్నారు. 


Also Read: హీరోలతోనే సమస్య... టికెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచించాలి... టికెట్ల వివాదంపై ఎన్వీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు


టిక్కెట్ రేట్లను పెంచాలని టాలీవుడ్ నిర్మాతలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల హీరో నాని చేసిన  వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. అయితే ఇండస్ట్రీలో కూడా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై ఆవేదన ఉంది. కానీ ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది కానీ తగ్గే అవకాశం లేదని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ధియేటర్లు టిక్కెట్ ధరల జీవోపై హైకోర్టుకెళ్లాయి. జీవోను హైకోర్టు కొట్టి వేసింది. కొత్త కమిటీని నియమించి ... ధరలను ఖరారు చేయాలని సూచించింది. ఈ మేరకు  ప్రభుత్వం కమిటీ నియమించింది. 


Also Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !


శుక్రవారం సమావేశమైన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వారం తర్వాత సమావేశం అవుతాదమని.. టిక్కెట్ రేట్లు ఎలా ఉండాలో నివేదిక ఇవ్వాలని అధికారులు సూచించారు.కానీ ప్రస్తుతం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తూంటే ప్రభుత్వానికి టిక్కెట్ ధరలు పెంచే ఆలోచన ఏదీ లేదని ఓ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. 


Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి