థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిలిమ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి.ప్రసాద్. పని ఒత్తిడిలో ఉన్న జాయింట్ కలెక్టర్లను కలిసి విన్నవించుకుంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. నెల సమయమివ్వడం సంతోషమేనన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. కరోనాతో రెండేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఓటీటీ కారణంగా సినీపరిశ్రమ నష్టాలకు మరో కారణం అన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ కాలయాపన చేయకుండా తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమ గురించి మాట్లాడవద్దన్నారన్న ఆయన... మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు సినీపరిశ్రమను బాధ పెట్టే విధంగా ఉన్నాయన్నారు. హీరోలు పరిశ్రమ సమస్యలపై స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. నట్టి కుమార్ ను తెలంగాణలో ప్రత్యేక ఛాంబర్ ను పెట్టుకోమనండంటూ ఎన్.వి. ప్రసాద్ మండిపడ్డారు. థియేటర్లలో టిక్కెట్ల రేట్లపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. కరోనా సమయంలో మూడు నెలల విద్యుత్ ఛార్జీలు మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్నారు. 


Also Read: ఏపీలో 'ఆర్ఆర్ఆర్'కు ఇది ప్లస్సే... మరి, టికెట్ రేట్స్ సంగతి?


సీజ్ చేసిన థియేటర్లు రీఓపెన్


ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల ఓనర్లకు కాస్త ఊరట కల్పించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తం రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు ఓ అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌‌లకు థియేటర్ల ఓనర్లు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఈ విషయాన్ని మచిలీపట్నంలో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లపై దాడుల సందర్భంగా ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను ఓనర్లు కచ్చితంగా సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. సీజ్ చేసిన థియేటర్లకు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని వివరించారు.


Also Read: టికెట్ రేట్స్ ఇష్యూ... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులు వీరే!


ఇటీవల థియేటర్లపై దాడులు


ఇటీవల ఆంధ్రాలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించని, తినుబండారాల కౌంటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్లపై కొరడా ఝుళిపించారు. సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను కూడా అధికారులు సీజ్‌ చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల ధరలు, ఫుడ్‌ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూలు చేస్తున్నట్లు గుర్తించి.. పెద్ద ఎత్తున థియేటర్లను సీజ్ చేశారు.


Also Read: సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మంత్రి వెల్లడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.