అల్లు అర్జున్ నటించిన పుష్ప దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప మేనియా బాలీవుడ్‌తో పాటు టీమిండియాకు కూడా చేరింది. భారత స్టార్ ఆల్‌రౌండర్ జడేజా కూడా పుష్ప సినిమాలోని ఐకానిక్ డైలాగ్ ‘తగ్గేదే లే’ డైలాగ్‌కు డబ్‌స్మాష్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ లాఫింగ్ ఎమోజీ, లవ్ ఎమోజీలతో రిప్లై ఇవ్వగా.. దానికి జడేజా ‘ఎంత ప్రయత్నించినా నీ అంత బాగా చేయలేదు. వెల్ డన్’ అని రిప్లై ఇచ్చారు.
ఈ పోస్ట్ కింద ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మావా..’ సాంగ్ చేయచ్చుగా అని కొందరు ఫన్నీగా అడుగుతున్నారు. గాయం కారణంగా ప్రస్తుతం రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరం అయ్యాడు.
ఇక పుష్ప విషయానికి వస్తే.. టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం దుమ్ము రేపుతుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్, తమిళనాడు, కేరళల్లో ఈ సినిమా కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయని నిర్మాతలు తెలుపుతున్నారు. పుష్ప రెండో భాగం షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు.
Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి