భారత స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం (డిసెంబర్ 24వ తేదీ) ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ వీడియోను కూడా విడుదల చేశారు.
‘మంచి విషయాలన్నిటికీ ముగింపు ఉంటుంది. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఆటకు ఈరోజు వీడ్కోలు చెబుతున్నాను. నా 23 సంవత్సరాల ప్రయాణాన్ని అందంగా, గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత్ తరఫున 103 టెస్టులాడిన హర్భజన్ 417 వికెట్లు తీశాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడాడు. హర్భజన్ టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా సాధించాడు.
టెస్టుల్లో ఒక మ్యాచ్‌లో 15 వికెట్లు తీసిన రికార్డు కూడా హర్భజన్‌కు సొంతం. ఒక ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(5.4) కూడా తనదే. కేవలం 96 మ్యాచ్‌ల్లోనే 400 టెస్టు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు రెండు ఫార్మాట్లలోనూ 1000 పరుగులు, 100 వికెట్లు తీశాడు.
Also Read: Vengsarkar On Kohli: కోహ్లీ కెప్టెన్సీ వివాదం.. దాదాకు ఆ అధికారం లేదన్న వెంగీ!
Also Read: IND vs SA: లంబూను కాదని సిరాజ్‌కే తొలి ఓటు..! శార్దూల్‌ను ఎంచుకుంటే మంచిదన్న ఎమ్మెస్కే
Also Read: IPL 2022: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా లారా.. పూర్తి వ్యూహాత్మక బృందం ఇదే!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
Also Read: 83 Film Update: ప్రపంచకప్ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్ డెవిల్స్..! ఎందుకో తెలుసా?
Also Read: Pro Kabaddi 2021: ప్రో కబడ్డీ మ్యాచ్‌ల్లో విజేతలు వీరే.. ఒక మ్యాచ్ ఉత్కంఠభరితంగా!