ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ రెండో రోజు మొత్తంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గుజరాత్ జెయింట్స్ 34-27 తేడాతో విజయం సాధించింది. ఇది గుజరాత్‌కు మొదటి గెలుపు. బెంగళూరులో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ ఆటగాడు అర్జున్ దేస్వాల్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. అయినా జైపూర్ ఓటమి పాలైంది.
ఇక రెండో మ్యాచ్‌లో.. దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్‌లు తలపడ్డాయి. 41-30 తేడాతో ఢిల్లీ, పుణేపై విజయం సాధించింది. ఢిల్లీకి చెందిన ఆటగాడు నవీన్ కుమార్ ఈ మ్యాచ్‌లో అత్యధికంగా 16 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత అత్యధిక పాయింట్లు కూడా ఢిల్లీకి చెందిన విజయ్ మాలికే సాధించాడు. తనకు తొమ్మిది పాయింట్లు దక్కాయి.
హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో 42-39 తేడాతో పట్నా విజయం సాధించింది. పట్నాకు చెందిన మోను గాయట్ అత్యధికంగా 15 పాయింట్లు సాధించాడు. హర్యానాలో రోహిత్‌కు పది పాయింట్లు దక్కాయి.