దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 300 దాటాయి. దేశంలో ఒమిక్రాన్, కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో ఒమిక్రాన్‌తో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ
ఇవాళ తమిళనాడు కొత్తగా 33 ఒమిక్రాన్ కేసులు, మహారాష్ట్రలో 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ నుంచి 104 మంది కోలుకున్నారు. కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ఈ వివరాలు తెలిపింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అవసరమైతే ఆంక్షలు విధించాలని ఆదేశించింది. కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కేంద్రం ఆదేశాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. గుజరాత్ లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 30కు చేరింది. వీటిల్లో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read : 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'
కేంద్రం మార్గదర్శకాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికా దేశాల్లో మొదలైన ఈ వేరియంట్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. భారత్ లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 300 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. క్రిస్మస్, న్యూ్ వేడుకలకు ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు అమలు చేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ ఆంక్షలు విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి