ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022కి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన వ్యూహ బృందాన్ని ఎంపిక చేసుకుంది. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌, పరుగుల వీరుడు బ్రయన్‌ లారాను వ్యూహకర్త, బ్యాటింగ్‌ సలహాదారుగా ఎంపిక చేసుకుంది. టామ్‌ మూడీ, డేల్‌ స్టెయిన్‌, ముత్తయ్య మురళీధరన్‌, హేమంగ్‌ బదానీతో సరికొత్త సహాయ బృందాన్ని ప్రకటించింది.


రెండేళ్ల క్రితం వరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బలమైన జట్టుగా ఉండేది. టామ్‌మూడీని తొలగించిన తర్వాత కాస్త బలహీనపడింది. ఈ సీజన్లో డేవిడ్‌ వార్నర్‌తో విభేదాలు వచ్చాయి. మిడిలార్డర్‌ ఘోరంగా విఫలమైంది. బౌలర్లూ శక్తిమేరకు రాణించలేదు. రషీద్‌ ఖాన్‌, వార్నర్‌ జట్టును వీడటంతో కేన్‌ విలియమ్సన్‌ను మాత్రమే ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది. మరో ఇద్దరు కుర్రాళ్లను రీటెయిన్‌ చేసుకుంది. రాబోయే వేలంలో సరికొత్త జట్టును రూపొందించుకోనుంది.






మొన్నటి వరకు సన్‌రైజర్స్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ మెంటార్‌గా ఉండేవారు. ఇప్పుడాయన ఎన్‌సీయే చీఫ్‌గా ఎంపికవ్వడంతో ఫ్రాంచైజీని వీడారు. ఈ నేపథ్యంలో బ్రయన్‌ లారాను హైదరాబాద్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా ఎంపిక చేసుకుంది. దాంతోపాటు వ్యూహాత్మక సలహాదారు బాధ్యతలను అప్పగించింది. అంతర్జాతీయ క్రికెట్లో లారా 22000 పరుగులకు పైగా చేసిన సంగతి తెలిసిందే.


దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది. గతంలో అతడు సన్‌రైజర్స్‌కు ఆడటం గమనార్హం. ముత్తయ్య మురళీధరన్‌కు స్పిన్‌ బౌలింగ్ బాధ్యతలు అప్పగించింది. క్రికెట్‌ చరిత్రలో 495 మ్యాచుల్లో 1347 వికెట్లు తీసిన ఘనత అతనొక్కడికే సొంతమన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ముగ్గురూ వ్యూహాత్మక బృందంలో కీలకంగా ఉంటారు. ఎప్పటిలాగే టామ్‌ మూడీని ప్రధాన కోచ్‌గా తీసుకుంది. సైమన్‌ కటిచ్‌కు సహాయ కోచ్‌గా ఎంపిక చేసింది. హేమంగ్‌ బదానీ ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉంటాడు.


Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే


Also Read: INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్‌ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్‌.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ


Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్‌ ప్రశంసలు.. ఎందుకంటే?


Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో


Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం


Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!