భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న సెంచూరియన్ టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది. తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్: 248 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం సాధించగా.. తనకు తోడుగా అజింక్య రహానే (40 బ్యాటింగ్: 81 బంతుల్లో, 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లు ఎవరికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (60: 123 బంతుల్లో, 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడటంతో మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా పడలేదు. లంచ్‌ సమయానికి టీమిండియా 28 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 83 పరుగులు సాధించింది. 2007 తర్వాత ఆసియా వెలుపల టీమ్‌ఇండియా తొలిరోజు తొలి సెషన్లో వికెట్‌ పోకుండా ఆడటం ఇదే తొలిసారి. రోహిత్‌, రాహుల్‌ ఈ ఏడాది ఆరంభంలో లార్డ్స్‌లో ఈ ఫీట్ సాధించినా.. ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయింది.


ఇక రెండో సెషన్‌లో కూడా టీమిండియా ఓపెనర్లు ఎటువంటి తడబాటు లేకుండా ఆడారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో మయాంక్ అగర్వాల్ తన అర్థసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.ఈ క్రమంలోనే రాహుల్, మయాంక్ మొదటి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. 2006లో వసీం జాఫర్, దినేష్ కార్తీక్, 2010లో గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత ప్రొటీస్ గడ్డపై 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించింది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ మాత్రమే.


మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే పుజారా (0: 1 బంతి) కూడా పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ (35: 94 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు.ొ


మూడో సెషన్‌లో కూడా భారత్‌కు మంచి ఆరంభమే లభించింది. క్రీజుల్లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం లుంగి ఎంగిడి బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ కోల్పోయిన మూడు వికెట్లూ ఎంగిడికే దక్కాయి.


ఆ తర్వాత రహానే, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ శతకం కూడా పూర్తయింది. ఆసియా బయట టెస్టు తొలిరోజు శతకం సాధించిన రెండో భారత ఓపెనర్ కేఎల్ రాహులే. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన టెంట్ బ్రిడ్జ్ మ్యాచ్‌లో మురళీ విజయ్ మొదటిసారి ఈ ఘనత సాధించాడు. దీంతో భారత్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది.


Also Read: 83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?


Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్‌!


Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?


Also Read: IND vs SA: ద్రవిడ్‌ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!


Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!


Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్‌, కోహ్లీ ప్రశంసలు