ఒకే రోజు న్యూజిలాండ్‌కు రెండు భిన్నమైన రికార్డులు దక్కాయి! ఆ జట్టు స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను ఆలౌట్ చేశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ 62 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు దక్కించుకొంది. భారత్‌లో అత్యల్ప టెస్టు స్కోరుకు పరిమితమైంది.
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు వణికించారు. 31 పరుగులకే 5 వికెట్లు పడగొట్టారు. యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కివీస్ బ్యాటర్ల వెన్ను విరిచాడు. జట్టు స్కోరు 10 వద్ద విల్ యంగ్ (4)ను పెవిలియన్ పంపించాడు. మరో 5 పరుగులకే టామ్ లేథమ్ (10)ని ఔట్ చేశాడు. అదే ఊపులో జట్టు స్కోరు 17 వద్ద సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (1)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అతడికి తోడుగా డరైల్ మిచెల్ (8)ని అక్షర్ పటేల్, హెన్రీ నికోల్స్ (7)ను అశ్విన్ ఔట్ చేయడంతో 14 ఓవర్లకు కివీస్ 31/5తో నిలిచింది. ఆ తర్వాత అశ్విన్ మరింత చెలరేగి టామ్ బ్లండెల్ (7), టిమ్ సౌథీ (0), విలియమ్ సోమర్ విలె (0)ను ఔట్ చేశాడు. దాంతో 28.1 ఓవర్లు ఆడిన కివీస్ 62కే ఆలౌటైంది.
అంతకు ముందు మయాంక్ అగర్వాల్ (150; 311 బంతుల్లో 17x4, 4x6) అదరగొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 221/4తో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్‌ఇండియాకు భారీ స్కోరు అందించాడు. అతడికి అక్షర్ పటేల్ (52; 128 బంతుల్లో 5x4, 1x6) తోడుగా నిలిచాడు. కానీ కివీస్ హీరో అజాజ్ పటేల్ మళ్లీ చెలరేగాడు. ఓకే ఓవర్లో వరుస బంతుల్లో జట్టు స్కోరు 224 వద్ద రెండు వికెట్లు తీశాడు. 71.4వ బంతికి నైట్ వాచ్‌మన్ వృద్ధిమాన్ సాహా (27; 62 బంతుల్లో 3x4, 1x6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అక్కడి నుంచి అక్షర్ పటేల్‌తో కలిసి మయాంక్ నిలకడగా ఆడాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరినీ ఔట్ చేసిన అజాజ్ పటేల్ మరింత చెలరేగి మిగిలిన వికెట్లనూ పడగొట్టి పది వికెట్ల ఘనత అందుకున్నాడు. టీమ్‌ఇండియా 325కు పరిమితం అయింది.
Also Read: Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి