మయాంకం మళ్లీ మొదలైంది..! వాంఖడేలో పరుగుల వరద పారింది..! గాయంతో జట్టుకు దూరమైన టీమ్ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (120 బ్యాటింగ్‌; 246 బంతుల్లో 14x4, 4x6) ఘనంగా సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తిరుగులేని శతకంతో మోత మోగించాడు. అలాంటిలాంటి సెంచరీ కాదది! 80 వద్ద వరుసగా 3 వికెట్లు పడ్డ తరుణంలో అద్వితీయ ఇన్నింగ్స్‌ అది!


మొత్తంగా న్యూజిలాండ్‌పై తొలి రోజు భారత్‌దే పైచేయి! స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ 4 వికెట్లతో టీమ్‌ఇండియాను దెబ్బకొట్టినా ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ అతడిని ప్రతిఘటించాడు. దాంతో శుక్రవారం ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 70 ఓవర్లకు 221/4తో నిలిచింది. వృద్ధిమాన్‌ సాహా (25 బ్యాటింగ్‌; 53 బంతుల్లో 3x4, 1x6) నైట్‌ వాచ్‌మన్‌గా నిలిచాడు.


ఒక సెషన్‌ ఆలస్యం..


మైదానం తడిగా ఉండటంతో తొలి సెషన్‌ ఆట జరగలేదు. దాంతో లంచ్‌ సమయంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ (44; 71 బంతుల్లో 7x3, 1x6) వేగంగా ఆడారు. చక్కని షాట్లతో అలరించారు. కట్టుదిట్టమైన బంతుల్ని అడ్డుకుంటూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. దాంతో 25 ఓవర్లకు భారత్‌ 71/0తో నిలిచింది.


పటేల్‌ బ్రేక్‌


జోరుగా ఆడుతున్న టీమ్‌ఇండియాకు స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ బ్రేకులు వేశాడు. జట్టు స్కోరు 80 వద్ద మూడు కీలక వికెట్లు తీశాడు. అర్ధశతకానికి చేరువైన శుభ్‌మన్‌ గిల్‌ను 27.3వ బంతికి పెవిలియన్‌ పంపించాడు. క్రీజులో ఉండి డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించిన గిల్‌.. రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మళ్లీ 29 ఓవర్లో బంతి అందుకున్న పటేల్‌ వరుసగా రెండు వికెట్లు తీశాడు. 29.2వ బంతికి పుజారాను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆఖరి బంతికి విరాట్‌ కోహ్లీనీ అతడే బలిగొన్నాడు. ప్యాడ్లకు బంతి తగలగానే పటేల్‌ బిగ్గరగా అప్పీల్‌ చేశాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (18; 41 బంతుల్లో 3x4) మయాంక్‌ అగర్వాల్‌ అర్ధశతకం చేయడంతో 37 ఓవర్లకు భారత్‌ 111/3తో టీకి వెళ్లింది.


సెంచరీ హోరు


కష్ట సమయంలో 80 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్న అగర్వాల్‌, అయ్యర్‌ జోడీనీ పటేలే విడదీశాడు. జట్టు స్కోరు 160 వద్ద శ్రేయస్‌ను పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత వృద్ధిమాన్‌ సాహాతో కలిసి అయ్యర్‌ చెలరేగాడు. తనదైన రీతిలో కవర్‌డ్రైవులు, సిక్సర్లు బాదేశాడు. 196 బంతుల్లో 100 కొట్టేశాడు. ఐదో వికెట్‌కు 134 బంతుల్లో అజేయంగా 61 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అతడికి తోడుగా సాహా సైతం చక్కని షాట్లు బాదడంతో ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 221తో నిలిచింది.


Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?


Also Read: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?


Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!


Also Read: శ్రేయస్‌నూ కరుణ్‌ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?


Also Read: రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇషాంత్ శర్మ ఔట్.. బీసీసీఐ ప్రకటన


Also Read: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్‌ తాజా కోటీశ్వరులు వీరే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి