అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు ఐసీసీ కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త మార్పులు జనవరి నుంచే అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మొదటి స్లో ఓవర్ రేట్‌కు ఇన్-మ్యాచ్ పెనాల్టీ కాగా.. ఇన్నింగ్స్ మధ్యలో ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ కూడా ఉండనుంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌ల మధ్య జనవరి 16వ తేదీన జరగనున్న మ్యాచ్ నుంచి ఈ మార్పులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మధ్య కాలంలో ఐసీసీ క్రికెట్‌లో మార్చిన కీలక రూల్స్ ఇవే..
1. ఇన్‌గేమ్ స్లో ఓవర్ రేట్
ఈ నియమం ప్రకారం.. బౌలింగ్ వేసే జట్టు షెడ్యూల్ చేసిన సమయానికి తమ చివరి ఓవర్‌లో మొదటి బంతి వేయాలి. ఒకవేళ ఇందులో విఫలం అయితే.. పెనాల్టీ కింద 30 గజాల సర్కిల్ అవతల అనుమతించిన సంఖ్య కంటే ఒక ఫీల్డర్‌ను తక్కువ పెట్టాలి. స్లో ఓవర్ రేటుకు పడే పెనాల్టీకి ఇది అదనం.
2. ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్
ఐసీసీ విధించిన రెండో నిబంధన ప్రకారం.. ప్రతి ఇన్నింగ్స్‌కు మధ్యలో ఒక ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ ఉండాలి. ఇది రెండున్నర నిమిషాలు ఉండవచ్చు. అయితే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ నిబంధన ఉండాలంటే.. ఆ రెండు జట్లూ సిరీస్ ప్రారంభానికి ముందే దీనికి అంగీకరించి ఉండాలి. ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తరహాలో ఈ డ్రింక్స్ బ్రేక్ అందుబాటులో ఉండనుంది.
3. ఎల్బీడబ్ల్యూ డీఆర్ఎస్ సందర్భంలో పెద్ద స్టంప్స్
2021 ఏప్రిల్‌లో ఐసీసీ దీనికి మార్పులు చేసింది. బంతిలో 50 శాతం బెయిల్స్‌కు తగిలినప్పుడు దాన్ని ఎల్బీడబ్ల్యూగా పరిగణించాలని ఐసీసీ నిర్ణయించింది. పాత రూల్ ప్రకారం.. బంతి బెయిల్స్‌కు తగిలినా.. అది అంపైర్స్ కాల్‌గానే పరిగణించేవారు. ఈ చిన్న టెక్నికల్ మార్పు బౌలర్లకు వరంగా మారింది.
4. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ 2021-23లో మార్పులు
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ 2021-23 కొత్త సైకిల్‌లో ఐసీసీ కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఇప్పుడు జరిగే ప్రతి మ్యాచ్‌కు డబ్ల్యూటీసీ పాయింట్లను అందించనుంది. గతంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అయినా.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అయినా.. 120 పాయింట్లే వచ్చేవి. ఈ కొత్త నియమం ప్రకారం.. ఐసీసీ పాయింట్ల ప్రక్రియను మరింత సులభం చేసింది. ఇప్పుడు జట్లు తాము ఆడిన మ్యాచ్‌ల్లో విజయాల ఆధారంగా పాయింట్ల పర్సంటేజ్‌ను పొందనున్నాయి. దీని ఆధారంగా ర్యాంకింగ్స్ నిర్ణయించనున్నారు.
Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు
Also Read: బుమ్రా, జన్‌సెన్ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్.. టెన్షన్
Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్! సఫారీల లక్ష్యం 240.. టీమ్‌ఇండియా 266 ఆలౌట్
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.