దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియొనెల్ మెస్సీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్యారిస్ సెయింట్ జర్మెయిన్ జట్టు తెలిపింది. సోమవారం ఫ్రెంచ్ కప్ గేమ్ జరగనుంది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకిందని పీఎస్‌జీ ప్రకటించింది.
వీరితో పాటు మరో స్టాఫ్ మెంబర్‌కు కూడా కరోనా సోకిందని కంపెనీ తెలిపింది. మొదట పీఎస్‌జీ ఆటగాళ్ల పేర్లను తెలపలేదు. తర్వాత వారి పేర్లతో మరో ప్రకటన వెల్లడించింది. మెస్సీతో పాటు జువాన్ బెర్నాట్, సెర్జియో రికోలకు కూడా కరోనా సోకినట్లు ఈ ప్రకటనలో తెలిపింది.
పీఎస్‌పీ ప్రస్తుతం థర్డ్ టైర్ గేమ్స్ ఆడుతోంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన మొనాకో సెకండ్ టైర్ గేమ్స్ ఆడనుంది. అయితే మొనాకోకు చెందిన ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. మరి ఈ మ్యాచ్, టోర్నీ జరుగుతుందో లేక నిలిపివేస్తారో చూడాలి.
Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
Also Read: IND vs SA: ద్రవిడ్ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!
Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!
Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్, కోహ్లీ ప్రశంసలు