టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గారాల పట్టి వామిక! ఆమె అంటే వారికెంతిష్టమో చెప్పతరం కాదు. ఆమె కోసం ఎంతో తపిస్తుంటారు. ఆమె మాటలు వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే ఆమె 'అమ్మా.. మా.. మమ్మా' అంటున్న ముద్దు ముద్దు మాటలు పలకగానే వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
'ఎంత బాగుందో! ఎంత ముద్దొస్తుందో!! ఈ ఏడాది ఫేవరెట్ వీడియో!! వామిక మా.. మమ్మా.. మమ్మా.. అంటోంది. ఈ వీడియో షేర్ చేసినందుకు అనుష్క శర్మకు థాంక్స్. ఒక తల్లికి ఇంతకు మించి ఆనందం ఇచ్చే విషయం మరోటి ఉండదు' అని ఇనుష్క శర్మ ఇన్‌స్టా నుంచి ఓ వీడియో పోస్ట్ వచ్చింది. అదిప్పుడు వైరల్‌గా మారింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. సఫారీ జట్టుతో టీమ్‌ఇండియా సోమవారం నుంచి రెండో టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. బయో బుడగల్లో అలసిపోతుండటం, ఒత్తిడి లేకుండా ఉండట వల్ల ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
వాండరర్స్‌లో జరిగే టెస్టు కోహ్లీ కెరీర్లో 99వ మ్యాచ్. మూడో టెస్టు వందోది. ఇప్పటి వరకు కోహ్లీ, అనుష్క దంపతులు తమ గారాల పట్టి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోలేదు. తనంతట తనకు తెలిసేంత వరకు ఆమెకు సంబంధించిన చిత్రాలు షేర్ చేయమని ఇంతకు ముందే చెప్పారు.
Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!
Also Read: Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!