వీసా సమస్యతో ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయారు. గంటల తరబడి అక్కడే ఎదురు చూడాల్సి వచ్చింది. జకోవిచ్ టీం చేసిన చిన్న పొరపాటుకు ఆయనకు సమస్యలు వచ్చాయి. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో అవమానం ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేందుకు టీకా నుంచి జకోవిచ్ మినహాయింపు పొందారు. వీసాకు అప్లికేషన్‌లో మాత్రం ఈ విషయాన్ని నమోదు చేయలేదు. వ్యాక్సిన్ వేసుకోవడంలో పొందిన మినహాయింపు అంశాన్ని ప్రస్తావించలేదు. అయితే ఆస్ట్రేలియా వచ్చిన వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించాలి. లేదా వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇచ్చే వైద్యాధికారుల ధ్రువీకరణ పత్రాన్నైనా సబ్‌మిట్ చేయాలి. కానీ ఈ రెండింటిని జకోవిచ్ టీం చేయలేదు.
వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించని కారణంగా ఎయిర్‌పోర్టులో కొన్ని గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు జకోవిచ్. గతేడాది వ్యాక్సిన్‌ను వ్యతిరేకిస్తూ ఆయన ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులోనే ఆపేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై జకోవిచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కుమారుడితోపాటు అందర్నీ గంటల కొద్దీ ఎయిర్‌పోర్టులో నిలిపేశారని ఇది మంచిది కాదన్నారు. దీనిపై పోరాడుతానని.. ఇది నా ఒక్కడి కోసం కాదని తనలాంటి వారి కోసమని జకోవిచ్ అన్నారు.
జకోవిచ్‌ను నిలిపేయడంపై సెర్బియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రెసిడెంట్ అలెగ్జాండర్ ప్యూకిక్ మండిపడ్డారు. నెంబర్ వన్ ఆడగాడిని ఇలానే ట్రీట్ చేస్తారా అంటు నిలదీశారు. ఈ వివాదంపై ఆస్ట్రేలియా వివరణ ఇచ్చింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందిస్తూ... తమ దేశానికి వచ్చిన ఎవరైనా సరే నిబంధనలు పాటించాలని అన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
Also Read: Ranji Trophy Postpone: ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్.. రంజీ ట్రోఫీ వాయిదా వేసిన బీసీసీఐ
Also Read: Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా