బిగ్‌బాస్ లాంటి ప్లాట్‌ఫామ్ వల్ల పాపులర్ అయి ఇన్ ఫ్లూయెన్సర్లుగా, యూట్యూబర్లుగా మారారు చాలా మంది. టైటిల్ కొట్టకపోయినా క్యారెక్టర్ పై మచ్చ లేకుండా బయటికి వస్తే అదే గొప్ప. కానీ బిగ్‌బాస్5 సీజన్లో సిరి-షణ్ముక్ మధ్యలో నడిచిన హగ్గుల పర్వం ప్రేక్షకులకే కాదు, వారిని ప్రేమించినవారికి కూడా చిరాకును, విరక్తిని తెప్పించింది. ఇప్పటికే షన్నూతో తన అయిదేళ్ల ప్రేమకు దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఇకపై కెరీర్ పై దృష్టి పెడతానని తేల్చిచెప్పింది. ఇప్పుడు అదే బాటలో సిరి కాబోయే భర్త శ్రీహాన్ కూడా నడవబోతున్నట్టు సమాచారం. 


ఎంగేజ్‌మెంట్ అయ్యాక
సిరి-శ్రీహాన్‌లకు నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇద్దరూ కలిసి ఒక బాబును దత్తత తీసుకున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన సిరి, షన్నూకు దగ్గరైంది. తమ మధ్య కనెక్షన్ వస్తుందంటూ నాగార్జునకే చెప్పింది. ఎప్పుడు చూసినా షన్నూకు తినిపించడం, అతడి బెడ్ మీదే పడుకోవడం, నిమిషానికో హగ్గు ఇవ్వడం చాలా రోత పుట్టించింది. ఈ విషయంలో శ్రీహాన్ కూడా చాలా హర్ట్ అయినట్టు టాక్. అందుకే బిగ్ బాస్ నుంచి సిరి వచ్చాక కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒక్కటీ బయటికి రాలేదు. అంతకుముందూ తరచూ కలిసి లైవ్‌లోకి వచ్చేవారు. బిగ్‌బాస్ లాంటి పెద్ద ఈవెంట్ నుంచి దాదాపు 3 నెలల తరువాత సిరి వచ్చినా కూడా అలాంటి లైవ్ సెషన్లు లేవు. 


ఇన్ స్టా నుంచి...
శ్రీహాన్ తాజాగా సిరి తాను కలిసి ఉన్న ఫోటోలను ఇన్ స్టా ఖాతా నుంచి తొలగించాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన యూట్యూబ్ సిరీస్‌ల ఫోటోలు మాత్రమే ఉంచాడు. దీన్ని బట్టి శ్రీహాన్ కూడా దీప్తి సునయన బాటలో నడవనున్నాడని, బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇటీవలే సిరి బర్త్ డేకు కేవలం విషెష్ చెప్పి ఊరుకున్నాడు. సాధారణంగా అయితే పెద్దగా సెలెబ్రేట్ చేసి ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేసి నానా హంగామా చేసేవారు. కానీ వీరి మధ్య పెరిగిన దూరానికి ఈ విషెస్ సాక్ష్యంగా మారింది. 


Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..


Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?