టెస్టు క్రికెట్‌లో విశేషంగా రాణించిన మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ తన ఆల్ టైం టెస్టు జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జాబితాలో ఒక్క భారతీయుడికి కూడా చోటు దక్కలేదు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ వంటి టెస్టు క్రికెట్ లెజెండ్స్‌కి కూడా చోటు దక్కలేదు.
కుక్ తన జట్టుకు మాజీ ఇంగ్లండ్ ఆటగాడు గ్రాహం గూచ్‌ను కెప్టెన్‌గా నిర్ణయించాడు. తనతో పాటు మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఇక వన్‌డౌన్ స్థానానికి బ్రియాన్ లారాను ఎంచుకోగా.. రికీ పాంటింగ్, కుమార సంగక్కర, జాక్వెస్ కలిస్‌లు మిడిలార్డర్‌లో ఉన్నారు. ఏబీ డివిలియర్స్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు.
ఇక స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లేకు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్‌లను తను స్పిన్నర్లుగా ఎంచుకున్నాడు. ఇక జేమ్స్ అండర్సన్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక చేసుకున్నాడు. జాక్వెస్ కలిస్‌ను ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు.
‘వారిలో ఎవరి గురించీ పరిచయం అక్కర్లేదు. అందరూ అద్భుతమైన ఆటగాళ్లు.’ అని కుక్ తన ఆల్ టైం ఎలెవన్ గురించి తెలిపాడు. అయితే ఈ జాబితాలో భారత్ ఆటగాళ్లకు చోటు లభించకపోవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలిస్టర్ కుక్ ఆల్‌టైం ఎలెవన్
గ్రాహం గూచ్ (కెప్టెన్) (ఇంగ్లండ్), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), బ్రియాన్ లారా (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్) (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు
Also Read: బుమ్రా, జన్‌సెన్ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్.. టెన్షన్
Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్! సఫారీల లక్ష్యం 240.. టీమ్‌ఇండియా 266 ఆలౌట్
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి