కోతులు గుడిలో కొబ్బరి చిప్పలు ఎత్తుకెళ్లడం చూస్తాం.. కానీ మనిషినే ఎత్తుకెళితే.. అసలు ఎందుకు ఎత్తుకెళ్లాయి. వాటికి ఏం అవసరం వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో రెండు నెలల బాబును అలానే ఎత్తుకెళ్లాయి. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి అందులో పడేశాయి. అసలు వివరాల్లోకి వెళ్తే..


ఉత్తర్రప్రదేశ్ మీరట్‌లోని బాగ్‌పట్‌లో కోమల్, ప్రిన్స్ భార్యాభర్తలు. రెండు నెలల క్రితం వీరికి బాబు పుట్టాడు. ఆ బాబుకు కేశవ్ కుమార్ అని పేరు పెట్టారు. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. కేశవ్ కుమార్ నానమ్మ కూడా అదే ఇంట్లో ఉంటుంది. మనవడు అంటే ఎంతో పిచ్చి. రోజూ ఆడిస్తుండేది. అయితే అందులో భాగంగానే.. ఆదివారం రాత్రి టెర్రస్ పైకి కేశవ్ కుమార్ ను తీసుకెళ్లింది. కాసేపు ఆడుకున్నాక.. ఆ రెండు నెలల బాబు పడుకున్నాడు. ఇంట్లోకి తీసుకువచ్చి.. కాసేపయ్యాక నిద్రపోయింది నానమ్మ. పడుకుంది గానీ.. గది తలపులు వేయడం మాత్రం మరిచిపోయింది. మరో గదిలో బిడ్డ.. తల్లిదండ్రులు పడుకున్నారు. ఈ సమయంలోనే.. కోతులు టెర్రస్ పైకి వచ్చాయి. 


తలుపు తెరిచి ఉండటంతో.. అందులోకి ప్రవేశించాయి.  నాన్నమ్మ పక్కనే పడుకున్న బాబును తీసుకెళ్లాయి. అయితే అవి తీసుకెళ్తుండగా.. బాబుకు ఏడ్వడం మెుదలుపెట్టాడు. ఉలిక్కిపడి లేచిన నాన్నమ్మ కోతుల నుంచి పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేసింది. అయినా ఎలాంటి ఫలితం లేదు. అటు ఇటు తిరిగిన కోతులు.. బాబును ఓ వాటర్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లాయి. ఆపై పిల్లాడిని అందులో పడేశాయి. పిల్లాడి కోసం కుటుంబ సభ్యులకు వాటర్ ట్యాంక్ లో చూడగా బాలుడు కనిపించాడు. కానీ అప్పటికే చనిపోయి నీటిలో తేలి ఉన్నాడు.  


అంతకుముందు కూడా.. ఇంట్లో పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు కోతులు ప్రయత్నించాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే కోతులను తరిమి పిల్లాడిని కాపాడమని చెప్పారు. కానీ మళ్లీ ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కోతులకు మా పిల్లాడిపై కోపం ఎందుకు అని అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తలపులు వేసి ఉంటే.. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని పిల్లాడి నాన్నమ్మ బోరున విలపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంటి దగ్గరలోని.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. టెర్రాస్‌పై నుంచి పిల్లాడిని ఎత్తుకుని ఆ కోతులు కిందకు దూకినట్లు వీడియోలో కనిపిస్తోంది.


Also Read: Nizamabad: మా చావుకు కారణం ఆ నలుగురే.. అస్సలు వదలొద్దు.. నిజామాబాద్ ఫ్యామిలీ సెల్ఫీ వీడియో వెలుగులోకి..


Also Read: Hyderabad: కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..


Also Read: Nalgonda: మైసమ్మ గుడి ముందు మనిషి తల కలకలం.. హడలిపోయిన స్థానికులు, మొండెం కోసం గాలింపు