Today Panchang April 22nd: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపదనిచ్చే మహాలక్ష్మి మంత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
ఏప్రిల్ 22 శుక్రవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 22- 04 - 2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం,
తిధి : షష్ఠి మ12.19 వరకు తదుపరి సప్తమి,
నక్షత్రం : పూర్వాషాఢ రా11.43 వరకు తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం : ఉ10.18 - 11.47
దుర్ముహూర్తం : ఉ8.13 - 9.03 & మ12.23 - 1.13,
అమృత ఘడియలు : రా7.14 - 8.44
రాహుకాలం : ఉ10.30 - 12.00
యమగండం : మ3.00 - 4.30
యోగం. : శివం ఉ10.27 వరకు,
కరణం : వణిజ మ12.19 వరకు తదుపరి విష్ఠి రా11.07 వరకు,
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.13
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
ఈ రోజు(శుక్రవారం) ప్రత్యేకత
ఈ రోజు లక్ష్మీదేవి సహా అమ్మవార్లు దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధించడం మంచింది. అదేవిధంగా తులసీపూజ, గోపూజలు చేయడం ద్వారాకూడా ఉత్తమ ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్టు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కుగాగా చిత్రీకరిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్టు చూపుతారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలలో అలంకరిస్తారు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చంటారు పండితులు.
సంపదనిచ్చే మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
శ్రీ మహాలక్ష్మి అష్టకం
నమస్తేస్తు మహామాయే… శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదా హస్తే… మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారూఢే… డోలాసుర భయంకరి
సర్వ పాపహరే దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే… సర్వదుష్ట భయంకరీ
సర్వదు:ఖ హరే దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి… భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంతరహితే దేవి… ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే… మహాలక్ష్మి నమోస్తుతే
స్థూల సూక్ష్మ మహా రౌద్రే… మహాశక్తి మహోదరే
మహాపాపహరే దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి… పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః… మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవి… నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాతః… మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్యష్టకం స్తోత్రం… యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధి మవాప్నోతి… రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం… మహాపాప వినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం… ధనధాన్య సమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం… మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మిర్భవేన్నిత్యం… ప్రసన్న వరదా శుభా