మేషం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిడికి అలసిపోతారు. మీ మాటలతో చాలా ఆకట్టుకుంటారు. స్నేహితుల సలహాలు పాటించండి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు.
వృషభం
కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాలి. వ్యాపారం వృద్ధి చేయడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగుల సమస్యలు తొలగుతాయి. మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
మిథునం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉండొచ్చు. తప్పుడు సలహా ఇచ్చే వారికి దూరంగా ఉండండి. ఉద్యోగం మారాలనుకుంటే ఈ రోజు చాలా మంచిది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. దంపతులు సంతోషంగా ఉంటారు.
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
కర్కాటకం
ఈరోజు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయకండి. పనిలో ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. నిరుద్యోగులు ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలున్నాయి. ఉదర సంబంధిత సమస్యతో బాధపడతారు.
సింహం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి.
కన్య
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం పొందొచ్చు. పాత రుణం తీర్చుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో పని చేయవలసి రావొచ్చు. బడ్జెట్‌పై ఎక్కువ వ్యయం ప్రభావం చూపుతుంది. Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
తుల
మీ ఆలోచనలు, సూచనలతో ప్రశంసలు అందుకుంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఓ పెద్ద సమస్య తొలగిపోతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రుల ఆదేశాలను అనుసరించండి. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
వృశ్చికం
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏ పనిలోనూ అసహనం ప్రదర్శించవద్దు. మీ ప్రణాళికల్లో ఆకస్మిక మార్పు ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. తెలియని వ్యక్తులతో వ్యవహారాలు పెట్టుకోవద్దు. కార్యాలయంలో మార్పులు జరుగుతాయి.
ధనుస్సు
వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉండొచ్చు. అనవసర ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారమవుతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభపడతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. మునుపటి కంటే మీలో విశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. ఎవ్వరికీ సలహా ఇవ్వకండి.
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
మకరం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకరి దృక్కోణంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. టెన్షన్ తగ్గుతుంది.
కుంభం
ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. పనిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారం అవడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. మీరు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో గొప్పగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణ ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి.
మీనం
స్నేహితుడితో విభేదాలు రావొచ్చు. టెన్షన్ పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం అందదు. మీరు మానసికంగా గందరగోళానికి గురవుతారు. మీ పనిపై చాలా శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు చేయకండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చు ఎక్కువ ఉంటుంది.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి