Ram Mandir: రామ జన్మభూమిలో 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్, ఇందులో నిజమెంత?
Ayodhya Ram Mandir: రామజన్మభూమిలో 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్‌ని భద్రపరచనున్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Ram Mandir Inauguration: అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Pran Prathishta) నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భవిష్యత్ తరాలకూ అయోధ్య చరిత్ర తెలిసే విధంగా జన్మభూమిలోనే 2 వేల అడుగులో లోతులో టైమ్ క్యాప్సూల్‌ని (Ayodhya Time Capsule News) ఉంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.. రామ జన్మభూమికి సంబంధించిన ప్రతి సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే వందల ఏళ్లుగా అయోధ్య రామ జన్మభూమిపై (Ayodhya Ram Mandir) ఎన్నో వివాదాలు నడిచాయి. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ 2019లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే...ఇకపై మరెప్పుడూ ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే దానికంటూ ఓ పరిష్కారం చూపించాలని ట్రస్ట్ భావించిందని అందుకే ఈ క్యాప్సూల్‌ని తయారు చేయించిందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగానే ఈ టైమ్ క్యాప్సూల్‌ని తయారు చేయించిందనీ కొందరు ప్రచారం చేస్తున్నారు. రామ మందిరంతో పాటు అయోధ్యకి సంబంధించిన ప్రతి డిటెయిల్‌నీ అందులో పొందుపరిచారని చెబుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సంస్కృత భాషలోనే ఉన్నట్టూ పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. కేవలం వివాదాలు తలెత్తకుండా అనే కాకుండా అటు విజ్ఞానపరంగానూ భవిష్యత్ తరాలు అయోధ్య గురించి తెలుసుకునేలా దీన్ని ఏర్పాటు చేశారని అంటున్నారు. మెటల్ కంటెయినర్‌తో దీన్ని తయారు చేశారట ఎప్పటికీ చెక్కు చెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భవిష్యత్‌లో ఆర్కియాలజిస్ట్‌లు, చరిత్రకారులూ ఈ క్యాప్సుల్‌తో ఇక్కడి చరిత్రను మొత్తం తెలుసుకోవచ్చు. రామ మందిరాన్ని ఏ సంవత్సరంలో, ఎలా కట్టారన్నదీ ఇందులో నిక్షిప్తం చేశారట.
ఇది నిజమేనా..?
ఇక్కడ భూమిలోపల దాచి పెట్టే ముందు (Ram Mandir Time Capsule) దాన్ని రాగి పత్రాల్లో ఉంచుతారనీ కొందరు తెగ ప్రచారం చేస్తున్నారు. అందులో సమాచారాన్ని చాలా సంక్షిప్తంగా రాయాల్సి ఉంటుందని..అందుకే...నిపుణులను సంప్రదించి వీలైనంత తక్కువ పదాలతో చరిత్రనంతా ట్రస్ట్ నిక్షిప్తం చేయించిందట. అయితే..ఇవన్నీ పుకార్లే. ఇప్పుడే కాదు. మూడేళ్ల క్రితమే ఈ వార్త బాగా వైరల్ అయింది. అప్పుడే ట్రస్ట్ జనరల్ సెక్రటరీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అయోధ్య టైమ్ క్యాప్సూల్ పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తమే అని తేల్చి చెప్పారు. అప్పట్లో ఆయన ప్రత్యేకంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆ పుకార్లను నమ్మొద్దని సూచించారు.
"Some news items are being circulated which suggest that a time capsule will be placed beneath the temple construction site in Ayodhya. Any such news is fake & should not be believed." : Shri Champat Rai, General Secretary, Shri Ram Janmbhoomi Teerth Kshetra. pic.twitter.com/5wO5Tu7NvX
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) July 28, 2020
గతంలోనూ ఇలాంటి టైమ్ క్యాప్సూల్స్ గురించి చర్చ జరిగింది. 2017లో బుర్గోస్‌లో జీసస్ క్రైస్ట్ విగ్రహం లోపల 400 ఏళ్ల నాటి క్యాప్సూల్ బయట పడింది. అందులో స్పెయిన్‌కి సంబంధించిన చారిత్ర, రాజకీయ, భౌగోళిక విషయాలు పొందు పరిచారు. ఇప్పటి వరకూ కనుగొన్న అతి పురాతన టైమ్ క్యాప్సూల్ ఇదేనని నిపుణులు వెల్లడించారు.
Also Read: Ram Mandir Inauguration: అయోధ్య వేడుకకు అద్వానీ రావడం లేదట, కారణమేంటంటే?