భారత తదుపరి నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్.. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. ఈ నెల 30న హరి కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత నౌకాదళాధిపతిగా ఉన్న సునీల్ లాంబా నవంబర్ 30న పదవీవిరమణ చేయనున్నారు.
1968 ఏప్రిల్ 12న పుట్టిన హరి కుమార్.. 1983 జనవరి 1న ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. 39 ఏళ్ల తన సర్వీసులో నేవిగేషన్, డైరెక్షన్లో మంచి నైపుణ్యం ఉన్న అధికారిగా పేరొందారు. ఐఎన్‌ఎస్ నిషాంక్, మిస్సైల్ కోర్‌వెట్టే, ఐఎన్‌ఎస్ కోరా, ఐఎన్‌ఎస్ రణవీర్, ఐఎన్ఎస్ విరాట్ సహా పలు యుద్ధనౌకలను ఆయన కమాండ్ చేశారు.
యూఎస్ నావల్ వార్ కాలేజ్, ఎమ్‌హౌ ఆర్మీ వార్ కాలేజ్, యూకే రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్‌లలో కీలక కోర్సులు చేశారు. హరి కుమార్‌కు పరమ విశిష్ట సేవా మెడల్ (పీవీఎస్‌ఎమ్), ది అతి విశిష్ట సేవా మెడల్ (ఏవీఎస్ఎమ్), విశిష్ట సేవా మెడల్ (వీఎస్ఎమ్) ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. భారత నౌకదళానికి హరి కుమార్ 22వ చీఫ్ కాగా తొలి ఇద్దరు చీఫ్‌లు బ్రిటీష్ జాతీయులు.
Also Read: COVID Vaccination Certificate: భారత్ టీకాలు తీసుకున్నారా బేఫికర్.. ఆ 96 దేశాలకు ఇక బ్యాగ్ సద్దేయండి!
Also Read: Farmer Protest Tractor March: పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మార్చ్.. రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతం
Also Read: Padma Awards 2021: పండ్ల వ్యాపారికి పద్మశ్రీ.. వాట్ ఏన్ ఐడియా బాబాయ్.. నీకు 'దేశం' సలాం!
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి