కేసీఆర్ ఇప్ప‌టికింతే! 


రాజ‌కీయాల్లో ఏమైనా జ‌రగొచ్చు. నిన్న‌టి మాట నేడు మారిపోవ‌చ్చు. నిన్న ప‌రిస్థితి రేపు ఉండక‌పోవ‌చ్చు. సో.. రాజకీయాల్లో నాయ‌కుల‌కు వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడు తెలంగాణ(Telangana) ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం భార‌త్ రాష్ట్ర స‌మితి(Bharat Rastra Samithi) కూడా త‌న వ్యూహాల‌ను మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ప‌రిస్థితులు ప్ర‌భావాలు.. కీల‌క అంశాలు.. ఎదుర‌వుతున్న స‌వాళ్లు.. ఇప్ప‌టికే ముంచెత్తిన క‌ష్టాలు వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని బీఆర్ ఎస్ త‌న వ్యూహాన్ని ప‌రిమితం చేసుకుంద‌ని ప‌క్కా స‌మాచారం. ఇంకా చదవండి


ఆటోలో ప్రయాణించిన కేటీఆర్


 హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని అనంతరం తెలంగాణ భవన్‌ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి కార్యక్తల సమావేశం నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) ఇదివరకే నిర్ణయించింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌ నియోజకర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం యూసుఫ్‌గూడలో జరిగింది. ఇందులో పాల్గొన్న కేటీఆర్(KTR) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా చదవండి


వెంట్రుక కూడా పీకలేరన్నాడు, ఎలక్షన్లకు ముందే జగన్ ఓటమి అంగీకరించారు: చంద్రబాబు


‘మీ ఉత్సాహాన్ని చూశాడంటే సీఎం వైఎస్ జగన్‌ ( AP CM YS Jagan)కు నిద్ర పట్టదు. ఆయనకు ఈ 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయం. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారు. జగనే ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నాడని’ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chanrababu) అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన రా! కదలి రా! సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోంది. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టారు. ఇందుకు సాక్ష్యం ఇక్కడున్న పోలీసులే అని చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే. జగన్ సభలకు తరలించిన జనం కాదన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి14 నియోజకవర్గాలు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా చదవండి


బాణాలకు బలైపోవడానికి అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడ్ని- షర్మిల


"అన్న వదిలిన బాణం " షర్మిల పై ఏపీ సీఎం జగన్ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. తన చుట్టూ ప్రత్యర్థులు రాజకీయ పద్మవ్యూహం పన్నారని వెన్నుపోట్లు.. ఎత్తులు పన్నుతున్నారని అయితే వారి వ్యూహం లో చిక్కి బాణాలకు బలై పోవడానికి తాను అభిమన్యుడిని కాదనీ అర్జునుడిని అంటూ సీఎం జగన్ భీమిలి సభ వేదిక గా తేల్చారు. నిజానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎక్స్ ప్రెస్ స్పీడ్ లో తన అన్న  జగన్ ను టార్గెట్ చేసుకుంటూ YS షర్మిల దూసుకు పోతున్నారు. ఇచ్ఛాపురం మొదలుపెట్టి ఇడుపులపాయ వరకూ సాగే ఆమె యాత్ర లో ప్రధానంగా తన తండ్రి YSR అందించిన పాలన కొనసాగించడం లో అన్న జగన్ ఫెయిల్ అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంకా చదవండి


రోడ్డు పక్కన కుర్చీలో కూర్చుని గవర్నర్ నిరసన


కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనూహ్యంగా ప్రవర్తించి అధికారులను పరుగులు పెట్టించారు. కొల్లం జిల్లాలో ఆయన కాన్వాయ్‌ని Student Federation of India (SFI) విద్యార్థులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన గవర్నర్ వెంటనే కార్ దిగి రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు వైపు వెళ్లారు. అక్కడే కుర్చీ వేసుకుని ేకూర్చున్నారు. తన కాన్వాయ్‌కి అడ్డం వచ్చిన ఆ విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆయన ఓ కార్యక్రమానికి వెళ్తుండగా SFI విద్యార్థులు ఇలా అడ్డగించారు. అధికార CPM పార్టీకి అనుబంధ సంస్థ అయిన SFIపై గవర్నర్ అంత అసహనం వ్యక్తం చేయడానికి కారణముంది. ఇంకా చదవండి


DMKతోనూ కాంగ్రెస్‌కి విభేదాలు?


I.N.D.I.A కూటమిలోని ఒక్కో పార్టీ కాంగ్రెస్‌ వరుస పెట్టి విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే జేడీయూ ఏకంగా బీజేపీతో పొత్తుకి సిద్ధమైంది. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌కి దూరంగానే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితీ ఇంతే. ఇప్పుడు మరో కీలక పార్టీ అయిన DMK కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసింది. కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ డీఎమ్‌కే మంత్రి ఒకరు తీవ్ర విమర్శలు చేయడం సంచలనమవుతోంది. ఆ పార్టీకి మునుపు ఉన్న బలం లేదని, ఎప్పుడో బలహీనపడిపోయిందని స్పష్టం చేశారు డీఎమ్‌కే మంత్రి రాజా కన్నప్పన్. ఇది కేవలం ఆయన ఒక్కరి అభిప్రాయమా..? లేదంటే నిజంగానే డీఎమ్‌కే, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా చదవండి


అమెరికాలో తీసిన 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా


''మేడిన్ అమెరికా... అసెంబుల్డ్ ఇన్ ఇండియా... 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా'' అంటూ 'బహుముఖం' ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జస్ట్ క్యాప్షన్ మాత్రమే కాదు... లుక్ కూడా అదిరింది. టాలీవుడ్‌ న్యూ ఏజ్  ఫిల్మ్ మేకర్స్ డిఫరెంట్ జోనర్స్, ఫిల్మ్ మేకింగ్స్, కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. మన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ లిస్టులో మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ & టెక్నీషియన్ రాబోతున్నాడు. అతని పేరు హర్షివ్ కార్తీక్. ఇంకా చదవండి


ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన రోహిత్, ఆనంది సినిమా


హీరోయిన్ ఆనంది గుర్తు ఉన్నారా? రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పాన్ ఇండియా 'రాజా సాబ్' తెరకెక్కిస్తున్న మారుతి దర్శకుడిగా పరిచయమైన 'ఈ రోజుల్లో' చిన్న రోల్ చేశారు. ఆ తర్వాత 'బస్ స్టాప్' సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు చిన్న సినిమాలు చేశాక... తమిళంలో నటించిన సూపర్ హిట్ 'కాయల్' ఆమె దశను మార్చింది. వరుసపెట్టి తమిళ సినిమాలు చేశారు. 'జాంబీ రెడ్డి', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో మళ్లీ ఆనంది తెలుగు సినిమాలకు వచ్చారు. ఇంకా చదవండి


పర్సనల్‌ లోన్‌ Vs గోల్డ్‌ లోన్‌ - ఏది తెలివైన నిర్ణయం?


మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి. కొందరికి అత్యవసరంగా డబ్బు కావలసివస్తుంది. అలాంటి అర్జెన్సీలో, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం, రెండోది.. వ్యక్తిగత రుణం తీసుకోవడం. మొదటిదాన్ని సురక్షిత రుణంగా (Secured loan), రెండో దాన్ని అసురక్షిత రుణంగా (Unsecured loan) బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు భావిస్తాయి. అర్హతల ఆధారంగా ఈ రెండు లోన్లూ తక్షణమే లభిస్తాయి, ఆర్థిక అవసరాలను తీరుస్తాయి. ఇంకా చదవండి


ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రోహన్ బోపన్న, 43 ఏళ్ల వయసులో సరికొత్త చరిత్ర


సిడ్నీ: భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్‌- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్‌ గ్రాండస్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు. ఇంకా చదవండి