ఓటర్లను భయపెడితేనే ఓట్లు పడతాయా?
తాయిలాల ప్రచారం పోయింది... ఉచితాల వర్షం ఆగింది. మద్యం పంచినా... డబ్బులు ఇచ్చినా.. ఓట్ల పడతాయో లేదో అన్న ఆందోళన. ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే... ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది. ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం... భయపెట్టడమే పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కువ వర్క్ అవుట్ అయ్యే ధియరీగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే ధోరణిలో జాతీయ పార్టీల నుండి.. ప్రాంతీయ పార్టీల వరకు ఇదే అంశాన్ని తమ ఎన్నికల వ్యూహాంగా అమలు చేస్తున్నాయి. తమ పార్టీ మ్యానిఫెస్టో చెప్పో... ఉచిత పథకాల పేరు చెప్పో... తమ పార్టీ ఘన చరిత్ర లేదా తమ హయాంలో సాగించిన పాలన అంశాలను చెప్పడం అనేది ఇప్పుడు పాత ట్రెండ్. ఇంకా చదవండి
పంట బోనస్ రూ.500
ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఎన్నికల సంఘం పర్మిషన్ తో తెలంగాణ మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. రాష్ట్ర రైతులకు సీజన్ ప్రారంభం కాబోతోంది, పండించిన ధాన్యం సమస్య ఉంది, స్కూల్స్ ప్రారంభం కానున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ నివేదిక ఇచ్చింది. దానిపై చర్చించేందుకు కేబినెట్ భేటీ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా చదవండి
గోల్డ్ మెడలిస్ట్ ఒక వైపు, బ్లాక్ మెయిలర్ మరో వైపు
వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గోల్డ్ మెడలిస్ట్, బిట్స్ పిలానీ స్టూడెంట్ రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారని, మరో వైపు కాంగ్రెస్ నుంచి బ్లాక్ మెయిలర్, 56 కేసులు ఉన్న వ్యక్తి పోటీ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరిని ఎన్నుకోవాలన్నది ప్రజల నిర్ణయమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో సోమవారం నిర్వహించిన పార్టీ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఇంకా చదవండి
సిట్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సంతోషించింది. రాష్ట్రంలో ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదు చిన్నపాటి సంఘటనలు మినహా మరే వివాదాలు లేవంటూ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలో చంద్రగిరి నియోజకవర్గంలో అనుకోని విధంగా అల్లర్లు జరిగాయి. పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ హింస చెలరేగింది. ఇంకా చదవండి
కేజ్రీవాల్ పార్టీకి విదేశీ నిధులు- ఫారెక్స్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సీరియస్
దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇప్పటికీ బీజేపీ-ఆప్ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇంకా చదవండి
కొవాగ్జిన్ సేఫ్ కాదన్న రిపోర్ట్‌ని కొట్టిపారేసిన ICMR
కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయంటూ Banaras Hindu University విడుదల చేసిన రిపోర్ట్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్వయంగా ఆస్ట్రాజెన్‌కా కంపెనీయే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంగీకరించడం కలకలం రేపింది. అప్పటి నుంచి కొవాగ్జిన్ టీకాపైనా (Covaxin Safety) దృష్టి పడింది. తమ వ్యాక్సిన్ 100% సేఫ్ అంటూ భారత్ బయోటెక్ కంపెనీ ఓ ప్రకటన కూడా చేసింది. ఇంకా చదవండి
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు.. జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్, ఏపీలో ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన జానీ మాస్టర్ పేరు బెంగళూరు రేవ్ పార్టీలో వినిపించింది. అందులో వాస్తవం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆయన ఖండించారు. ఇంకా చదవండి
కొత్త రికార్డ్ వైపు దూసుకెళ్తున్న గోల్డ్
సానుకూల పరిస్థితులు తోడవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు మరో రికార్డ్ స్థాయి వైపు దూసుకెళ్తోంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,433 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర 10 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 10 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 100 ఎగబాకింది. ఇంకా చదవండి
అహ్మదాబాద్‌లో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టేనా?
ఐపీఎల్ 2024లో తొలి ప్లే(Play Off) ఆఫ్‌కు రంగం సిద్దమైంది. గుజరాత్(Gujarat)లోని అహ్మద్‌బాద్‌లో ఉన్న నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గత ఏడాది వన్డే ప్రపంచకప్ (Odi World Cup 2023) ఫైనల్ ఇదే వేదికపైనే జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. ఇంకా చదవండి
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ బలమిదే, అది కలిసొస్తే కప్పు మనదే !
ప్యాట్ కమిన్స్ సారథ్యం... ఓపెనర్ల విధ్వంసం... భారీ స్కోర్లు... విధ్వంసకర బ్యాటింగ్ ఇవన్నీ కలిసి... సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఐపీఎల్ 2024లో తిరుగులేని జట్టుగా నిలిపింది. ఈ ఐపీఎల్(IPL 2024)లో మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించిన హైదరాబాద్ బ్యాటర్లు... 160కుపైగా పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలోపే ఛేదించారు. ఇంకా చదవండి