Daily Horoscope -  రాశిఫలాలు (21-05-2024)


మేష రాశి
ఆర్థికంగా బలపడే అవకాశాలు పొందుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అతిథుల రాకవల్ల  ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సామాజిక హోదా పెరుగుతుంది. కొత్త ఆస్తి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


వృషభ రాశి
ఈ రోజు మీ కలలు నెరవేరుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. అనవసర ఖర్చులను అదుపులో పెట్టుకోండి. ఈ రోజు ప్రేమ జీవితంలో కొత్త సాహసాలు ఉంటాయి.


మిథున రాశి
ఈ రోజు మీకు సానుకూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో వాతావరణం సహకరిస్తుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకండి. కొంతమంది జీవితంలోకి మాజీ ప్రేమికులు తిరిగి వచ్చే అవకాశం ఉంది.


కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు.  వ్యాపారంలో లాభం ఉంటుంది. కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు.  కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. సహనం పాటించండి.  కోపాన్ని నియంత్రించుకోండి.  


సింహ రాశి
మీ సృజనాత్మకత , నైపుణ్యాలు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు.  వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. మీ భావాలను భాగస్వామికి తెలియజేసేందుకు సరైన సమయం ఇది. 


కన్యా రాశి
వృత్తిపరమైన జీవితంలో ముఖ్యమైన మార్పులు ఉంటాయి. పాత పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.  ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. మీరు చేపట్టే కార్యక్రమాలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బావుంటుంది. 
 
తులా రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయండి. ప్రియమైనవారికి సమయం కేటాయించండి. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వ్యాపార ఒప్పందంపై సంతకం చేసే ముందు, పత్రాలను జాగ్రత్తగా చదవండి. సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.  


వృశ్చిక రాశి
ఈ రోజు విద్యార్థులు ఆహ్లాదకర ఫలితాలను పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చాలా కాలం తర్వాత పాత మిత్రులను కలుస్తారు. కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో విజయాల మెట్లు ఎక్కుతారు. కొత్త పెట్టుబడి ఎంపికలపై నిఘా ఉంచండి. ఈరోజు ఆలోచనాత్మకంగా చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. శృంగార జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  


ధనుస్సు  రాశి
ఈ రోజు మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. చేపట్టే పనిలో మంచి ఫలితాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఈ రోజు మీ భాగస్వామితో గత సమస్యల గురించి ఎక్కువగా చర్చించవద్దు.  


మకర రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబంతో కలిసి సెలవులు ప్లాన్ చేసుకోవచ్చు. వృత్తి జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. బంధంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామి యొక్క భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండండి.


కుంభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం లేదా స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ అన్ని పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. పరిశోధన చేయకుండా పెట్టుబడి పెట్టకండి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించండి..ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.  


మీన రాశి
ఈ రోజు ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి.  వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి భాగస్వామితో బంధం బలపడుతుంది. ఉత్తేజకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు.