Covaxin News: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయంటూ Banaras Hindu University విడుదల చేసిన రిపోర్ట్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్వయంగా ఆస్ట్రాజెన్‌కా కంపెనీయే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంగీకరించడం కలకలం రేపింది. అప్పటి నుంచి కొవాగ్జిన్ టీకాపైనా (Covaxin Safety) దృష్టి పడింది. తమ వ్యాక్సిన్ 100% సేఫ్ అంటూ భారత్ బయోటెక్ కంపెనీ ఓ ప్రకటన కూడా చేసింది. అయితే...ఈ టీకా వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తప్పవని బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు తేల్చిచెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో 1% మంది హార్ట్‌అటాక్‌లు వచ్చాయని ఈ అధ్యయనం వెల్లడించారు. మరి కొందరిలో Guillain-Barre Syndrome కూడా కనిపించిందని తెలిపింది ఈ రిపోర్ట్. ఈ సిండ్రోమ్ కారణంగా విపరీతమైన నీరసం, కాళ్లు, నరాల నొప్పులు వస్తాయని వివరించింది. 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకూ అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ తయారు చేసినట్టు వెల్లడించింది. తాము సేకరించిన శాంపిల్స్‌లో 50% మేర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు కనిపించాయని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్‌పైనే ICMR అసహనం వ్యక్తం చేసింది. ఈ రిపోర్ట్ తయారు చేసేందుకు అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది. సరైన విధంగా పరిశోధన చేశారా లేదా అన్న అనుమానాలున్నాయని వెల్లడించింది. వాళ్లలో కనిపించే ఆరోగ్య సమస్యల్ని కొవాగ్జిన్‌కి లింక్ చేసి ఎలా చూస్తోందో క్లారిటీగా చెప్పలేదని స్పష్టం చేసింది.
డేటా కలెక్ట్ చేసిన విధానాన్నీ విమర్శించింది ICMR.కొంత మందికి ఫోన్ కాల్ చేసి వివరాలు సేకరించారని వెల్లడించింది. పైగా వ్యాక్సిన్ తీసుకున్న ఏడాది తరవాత కాల్ చేసి వాళ్లు ఏది చెబితే అదే రికార్డ్ (Covaxin Side Effects) చేసుకున్నారని మండి పడింది. మెడికల్ రికార్డులతో పోల్చుకుని చూడకుండానే రిపోర్ట్ తయారు చేసిందని విమర్శించింది. అసలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పడానికి ఎలాంటి టెక్నికల్ డేటా ఇవ్వలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఆ ప్రొఫెసర్స్ వెంటనే వాళ్లు అనుసరించిన మెథడాలజీ ఏంటో వెల్లడించాలని తేల్చి చెప్పింది. ఈ రిపోర్ట్‌పై భారత్ బయోటెక్ సంస్థ కూడా స్పందించింది. తమ వ్యాక్సిన్‌లకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని మరోసారి స్పష్టం చేసింది. ఈ రికార్డ్‌కి మచ్చ తెచ్చే విధంగా కొంత మంది ఇలాంటి రిపోర్ట్‌లు విడుదల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే భారత్‌లోని కొందరు ఎక్స్‌పర్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. కొవిడ్ టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అన్ని టీకాల సేఫ్‌టీపైనా రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉన్న సందేహాలు తీరాలంటే ఇలా సమీక్షించడం చాలా కీలకం అని సూచించారు. CoWIN లెక్కల ప్రకారం భారత్‌లో 17% మేర కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నారు. మిగతా వాళ్లంతా కొవిషీల్డ్ తీసుకున్నా వాళ్లే. అందుకే కొవిషీల్డ్‌పై అనుమానాలు వచ్చినప్పటి నుంచి ఆందోళన మొదలైంది.
Also Read: Iran: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్బర్ నియామకం, ఆదేశాలు జారీ చేసిన సుప్రీం లీడర్