Andhra News Today: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ రిమాండ్ ను కోర్టు మరింత పొడిగించారు. జూన్ 3 వరకూ కవిత రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో తీహార్ జైలు అధికారులు కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక తాజాగా ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ సిటీ (Kakinada), పిఠాపురం (Pithapuram) నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని అప్రమత్తం చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటతో సహా పలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ముద్రగడ తొందరపడి నోరు జారారా! జూన్ 4 తర్వాత పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ ఓ పక్క తీవ్రంగా జరుగుతుంటే.. మరో పక్క పిఠాపురంలో ఎవరు గెలుస్తారు..? అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ తీవ్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.. దీనికి ప్రధాన కారణం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఓ కారణం అయితే పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తా... ఓడించ‌క‌పోతే నా పేరు మార్చుకుంటానని శపథం ముద్రగడ పద్మనాభం సవాలుతో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


జగన్ దిగిపోవడం ఖాయం, తప్పయితే నా ముఖంపై పేడ పడుతుంది - పీకే కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ సీపీ అధికారంలో కొనసాగబోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురు అవుతుందని తేల్చి చెప్పారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఫలితం ఉండబోదని అన్నారు. ఆయన నమ్మకం వ్యక్తం చేసినట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటివారు కూడా చెబుతున్నారని.. వారి పార్టీలు ఎన్నికల్లో గెలవబోవని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


శ్రీకాంత్ ఉన్నది హైదరాబాద్‌లోనే - బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలో క్లారిటీ
ఇప్పుడు శతాధిక చిత్ర కథానాయకుడు, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ పేరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా న్యూస్ ఛానళ్లలో మార్మోగుతోంది. బెంగళూరు నగరంలో జరిగిన ఓ రేవ్ పార్టీ మీద రైడ్ చేసిన అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టుకున్న వ్యక్తుల్లో టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ సైతం ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ వ్యక్తుల్లో శ్రీకాంత్ ఉన్నారని కొందరు వార్తలు ప్రసారం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి