IPL 2024 Sunrisers Hyderabad strength and weekness: ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యం... ఓపెనర్ల విధ్వంసం... భారీ స్కోర్లు... విధ్వంసకర బ్యాటింగ్‌ ఇవన్నీ కలిసి... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)ను ఐపీఎల్‌ 2024లో తిరుగులేని జట్టుగా నిలిపింది. ఈ ఐపీఎల్‌(IPL 2024)లో మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించిన  హైదరాబాద్‌ బ్యాటర్లు... 160కుపైగా పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలోపే ఛేదించారు. 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని కూడా మరో అయిదు బంతులు మిగిలి ఉండాగానే ఛేదించందంటే  ఈ సీజన్‌లో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి హైదరాబాద్‌ బ్యాటర్లు చెలరేగితే కోల్‌కత్తా బౌలర్లకు కష్టాలు తప్పవు.


భీకర ఫామ్‌లో టాప్‌ ఆర్డర్‌
టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అందరూ భీకర ఫామ్‌లో ఉండడంతో ఈసారి కప్‌ సన్‌రైజర్స్‌దే అని SRH అభిమానులు ధీమాగా ఉన్నారు. అంతేనా గత లెక్కలను కూడా బయటకు తీస్తున్నారు. ఐపీఎల్‌ ప్రారంభమైన తర్వాత అత్యధిక స్కోరు 263. సరిగ్గా పదకొండేళ్ల క్రితం యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 175 పరుగులతో అజేయంగా నిలవడంతో... బెంగళూరు 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసింది. ఈ రికార్డును ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకుండా సన్‌రైజర్స్‌ బద్దలుకొట్టింది. దీనినిబట్టి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఎంత సమష్టిగా రాణించారో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు అత్యధిక పరుగుల రికార్డును మళ్లీ బెంగళూరో, ముంబై లాంటి జట్టో బద్దలు కొడుతుందనే అంచనాలుండేవి. కానీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్‌ రికార్డును సొంతం చేసుకుంది. అంతేనా మరో రెండు సార్లు కూడా సన్‌రైజర్స్‌ 250కుపైగా పరుగులు సాధించి భీకరంగా ఉంది..


 

బౌలింగ్‌లోనూ..

హైదరాబాద్‌ జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌,  పాట్‌ క‌మిన్స్‌లతో హైదరాబాద్‌ బౌలింగ్‌ బలంగా ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బౌలింగ్‌ అనుకూలించే పిచ్‌పై రాణిస్తే భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమే. బౌలింగ్ విష‌యానికొస్తే భువ‌నేశ్వర్ కుమార్ 24 వికెట్లు తీశాడు. భువీ మరోసారి రాణిస్తే... ఇరు జట్లలోని బ్యాటర్లకు తిప్పలు తప్పవు. 

 

అది కలిసొస్తే...

2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ కప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ లెక్కలను చూస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు... ఈసారి కప్పు మనదే అని సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.