టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కేనో!


తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తరువాత తెలంగాణ పీసీసీ చీఫ్ (TPCC Chief) మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికార పీఠం ఎవరికి దక్కనుందో జూన్ 4న తేలనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో దృష్టి సారిస్తుందని నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా జూన్ 26, 2021 లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుండి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సారధ్యంలో శాసన సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఇంకా చదవండి


బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం!


కాంగ్రెస్ నేతలు అధికారం కోసం బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ట్వీట్ చేశారు. ఇంకా చదవండి


రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం


ఏపీలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం పల్నాడు, అనంతపురం జిల్లాల్లో శనివారం నుంచి దర్యాప్తును విస్తృతం చేసింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించిన బృంద సభ్యులు బాధితులు, పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీడియో ఫుటేజీ, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఇంకా చదవండి


ఓటమిని ముందే ఎవరూ అంగీకరించరు, జగన్ కూడా అంతే! ఆయన దిగిపోతారు - పీకే కీలక వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ సీపీ అధికారంలో కొనసాగబోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురు అవుతుందని తేల్చి చెప్పారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఫలితం ఉండబోదని అన్నారు. ఆయన నమ్మకం వ్యక్తం చేసినట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటివారు కూడా చెబుతున్నారని.. వారి పార్టీలు ఎన్నికల్లో గెలవబోవని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్‌కు ఢిల్లీలో ఆదివారం (మే 19) ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి


ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం హెలికాప్టర్ క్రాష్!


ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇబ్రహీం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కుప్పకూలినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దులో ప్రమాదం జరిగింది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌ లోని జోల్ఫా నగరానికి సమీపంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇంకా చదవండి


తగ్గేదేలే! 3300 మందితో పార్లమెంట్ సెక్యూరిటీ మరింత పటిష్టం


భారత పార్లమెంటు సమగ్ర భద్రత (Parliament Security) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ భద్రత బాధ్యతలను ఇకపై సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) నిర్వహించనుంది. సీఐఎస్‌ఎఫ్‌‌కు చెందిన 3300 మందికిపైగా సిబ్బంది మే 20 తేదీ సోమవారం నుంచి విధులు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సీఆర్పీఎఫ్‌ (CRPF)కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ (PDG), ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌ పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రత బాధ్యతలను నిర్వహించాయి. ఇంకా చదవండి


'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క


ఎన్.టి.ఆర్. - ఈ పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర ఉంది... ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు. మనవడు, హరికృష్ణ కుమారుడికి తన పేరే పెట్టారు. నటనలో టన్నుల కొద్దీ ట్యాలెంటుతో తాతకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేశారు. ఇంకా చదవండి


ఇండియన్ 2 రిలీజ్ డేట్ - జూలైలో భారతీయుడిగా కమల్ సందడి ఆ రోజే


లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్‌, లెజెండరీ ఇండియన్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరు. 'భారతీయుడు'కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆ 'ఇండియన్ 2' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇంకా చదవండి


జనానికి అందనంత ఎత్తు ఎక్కిన గోల్డ్‌ 


అమెరికాతో పాటు చైనాలో ఆశావహ పరిస్థితులు కనిపిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు అధిక స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,417 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయినా గోల్డ్‌ రేటు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. వెండి రేటు కూడా స్థిరంగా ఉంది. ఇంకా చదవండి


వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు


ఐపీఎల్ 2024లో లీగ్ దశలో చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది. ఆదివారం రాత్రి రాజస్థాన్‌, కోల్‌కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు చేశారు. టాప్ 2 ప్లేస్ కన్ఫామ్ చేసుకోవడానికి రాజస్థాన్ కు ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి. కానీ టాస్ అనంతరం ఒక్క బంతి కూడా పడకుండానే RRvsKKR మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇంకా చదవండి