Kamal Haasan's Indian 2 Release Date Announced: లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్‌, లెజెండరీ ఇండియన్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరు. 'భారతీయుడు'కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆ 'ఇండియన్ 2' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


జూలై 12న థియేటర్లలోకి 'ఇండియన్ 2'
'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు 2') సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ సంస్థలపై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మే 22న 'ఇండియన్ 2'లో తొలి పాట!
Indian 2 First Single Release Date: 'ఇండియన్ 2' చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో తొలి పాటను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. కమల్ 'విక్రమ్' విజయంలో అనిరుద్ పాటలే కాదు, నేపథ్య సంగీతం సైతం కీలక పాత్ర పోషించింది. అందువల్ల, ఈ సినిమా సంగీతంపై అంచనాలు నెలకొన్నాయి.


Also Read: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్




'భార‌తీయుడు' సీక్వెల్ అంటే ప్రేక్షకులలో ఎటువంటి అంచ‌నాలు ఉంటాయో దర్శకుడు శంకర్‌కు తెలియనిది కాదు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తి పాత్రలో మరోసారి క‌మ‌ల్ హాస‌న్ కనిపించనున్నారు. ఈ సినిమా కంటే ముందు జూన్ 27న విడుదల కానున్న ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' సినిమాలోనూ కమల్ సందడి చేయనున్నారు. 2024లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నికార్సైన పాన్ ఇండియన్ చిత్రాలివి. బాక్సాఫీస్ బరిలో ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ అందుకుంటాయో లేదో చూడాలి. అసలు, ఈ ఏడాది 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాలు ఏవో కింద వెబ్ స్టోరీలో చూడండి.


Also Readచందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు - పవిత్ర జయరాం అక్రమ సంబంధాలపై శిల్ప



Indian 2 Movie Cast And Crew: క‌మ‌ల్ హాస‌న్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాలో ఎస్.జె సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్రధాన తారాగణం. ఇతర పాత్రల్లో నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఎ. శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఛాయాగ్రహణం: ర‌వి వ‌ర్మ‌న్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌. శంక‌ర్‌ - బి. జ‌య‌ మోహ‌న్‌ - క‌బిల‌న్ వైర‌ముత్తు - ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మాటలు (తెలుగులో): హ‌నుమాన్ చౌద‌రి, పాట‌లు (తెలుగులో): శ్రీమ‌ణి, సంగీతం: అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ నిర్మాతలు: సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జికెఎం త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌, క‌థ‌ - ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌. శంక‌ర్‌.