బుల్లితెర నటి, 'త్రినయని' సీరియల్ ఫేమ్ పవిత్రా జయరాం (Pavithra Jayaram Accident) వివాహేతర సంబంధాల మీద నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ (Serial Actor Chandu) భార్య శిల్ప సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త కంటే ముందు ఆవిడకు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement


పవిత్ర జీవితంలో ఆరో మగాడు నా భర్త!
Serial Actor Chandu Wife Shilpa: చందు జీవితంలో పవిత్ర జయరాం వచ్చిన తర్వాత తన జీవితం పరమ నాశనం అయ్యిందని శిల్ప కన్నీరు పెట్టుకుంది. చందుతో తనది ప్రేమ వివాహం అయినప్పటికీ... పవిత్ర రాకతో భర్త తనను పూర్తిగా దూరం పెట్టారని భోరున విలపించింది. లాక్ డౌన్ సమయంలో చంద్రకాంత్, పవిత్ర జయరాం ఒక్కటి అయ్యారని శిల్ప వివరించింది. అప్పటి నుంచి తనకు భర్త నుంచి మెంటల్, ఫిజికల్ టార్చర్ మొదలైందని పేర్కొంది. 'త్రినయని' సీరియల్ చేసేటప్పుడు చందు, పవిత్ర ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలు ఉన్నారు. పవిత్ర పిల్లల నుంచి చందుతో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ లభించిందని శిల్ప చెబుతున్న మాటలను బట్టి అనుకోవాలి. అయితే, పవిత్రను వదిలి తనతో ఉండమని భర్తను వేసుకున్నట్టు ఆవిడ వివరించింది.


టీవీ ఇండస్ట్రీలో, 'త్రినయని' సీరియల్ యూనిట్ సభ్యులకు చందు, శిల్ప ఎఫైర్ గురించి పూర్తిగా తెలుసని శిల్ప చెబుతోంది. ఇండస్ట్రీ నుంచి పలువురు తనకు ఫోన్ చేశారని, పవిత్ర మంచిది కాదని చెప్పారని, ఆమె జీవితంలో చందు ఆరో వ్యక్తి అని చెప్పినట్టు శిల్ప ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. ఎప్పటికైనా పవిత్ర నిజ స్వరూపం తెలుసుకుని నీ భర్త నీ దగ్గరకు వస్తాడని ఇండస్ట్రీ వ్యక్తులే తనకు ధైర్యం చెప్పినట్టు తెలియజేసింది.


పిల్లల కోసం బాధలు అన్నీ భరించా
చందు, శిల్ప దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరిలో పాప పెద్దది. రేపన్న రోజు తండ్రి అవసరం పిల్లలకు ఉంటుందని, అందు కోసం తనకు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎంత టార్చర్ పెట్టినా సరే వాళ్ల ఎఫైర్ సంగతి తన కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పలేదని కంటతడి పెట్టింది శిల్ప.


Also Readపిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు


పవిత్ర జయరాం రోడ్ యాక్సిడెంట్‌లో తిరిగిరాని లోకాలకు వెళ్లడం, ఆమె మృతి తర్వాత సోషల్ మీడియాలో చందు చేసిన పోస్టుల వల్ల విషయం బయటకు పొక్కిందని శిల్ప విలపించింది. పవిత్ర మాయలో పడి ప్రాణాలు తీసుకున్న చందు, తనతో పాటు బిడ్డలను అనాథలు చేశాడని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని ఆవిడ పేర్కొంది.


పవిత్ర జయరాం మీద శిల్ప చేసిన ఆరోపణలు టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. 'త్రినయని' సీరియల్ కాస్ట్ అండ్ క్రూతో పాటు ఆమె, చందు వ్యవహారం తెలిసిన పలువురు మౌనం వహిస్తున్నారు. సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఏం చెప్పినా, కామెంట్ చేసినా వైరల్ అవుతాయని సైలెంట్ అయిపోయారు.


Also Readఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప