Star Actor Plays Lead in PM Narendra Modi Biopic: ఈ మధ్య సినీ ఇండస్ట్రీ బయోపిక్‌లపై పడింది. భారతదేశానికి చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తీస్తూ హిట్ కొడుతున్నారు. అలా వచ్చిన ఎన్నో సినిమాలు భారీ హిట్ అయ్యాయి. అలాగే కొన్ని బొల్తా కొట్టాయి కూడా. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తిగా నిలిచిన బయోపిక్ ఏదైనా ఉందంటే అదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీదే. కొద్ది రోజులు మోదీ బయోపిక్ హాట్‌టాపిక్ నిలిచింది. ఇది తీసే డైరెక్టర్ ఎవరూ, మోదీగా నటించే నటుడు ఎవరనేది ఆసక్తి నెలకొంది. అంతేకాదు నరేంద్ర మోదీ బయోపిక్ అనేది వార్తల వరకేనా, లేదా కార్యరూపం దాల్చి వెండితరపై ఆవిష్కృతం అవుతుందా? లేదా? అని అంతా సందేహంలో పడ్డారు.
ఈ క్రమంలో మోదీ బయోపిక్‌కి సంబంధించిన ఓ ఆసక్తిర అప్‌డేట్ బయటకు వచ్చింది. మోదీ బయోపిక్‌లో నరేంద్ర మోదీగా నటించే నటుడు ఈయనే అంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ దర్శనం ఇచ్చింది. ఇది తెలిసి ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. బాహుబలితో ఇండియా వైడ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్ను ఆయన మోదీ బయోపిక్ నటించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఇంతకి ఆయన ఎవరంటే 'బాహుబలి' చిత్రం ఒక్కసారిగా వరల్డ్ వైడ్ ఆయన పేరు సెన్సేషన్ అయ్యింది. ప్రతి ఒక్కరి నోట ఇదే పేరు. ఆయనే 'బాహుబలి కట్టప్ప' సత్యరాజ్.
తమిళ నటుడైన ఆయన ఈ చిత్రంలో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ చిత్రంలో నేషనల్ వైడ్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలు పోషించించి మెప్పించిన ఆయన ఇప్పుడు మోదీ బయోపిక్‌లో లీడ్ రోల్ చేయబోతున్నారట. ఎందుకంటే సత్యరాజ్ పోలికలు నరేంద్ర మోదీకి కాస్తా దగ్గరగా ఉంటాయి. దీంతో ఈ బయోపిక్ ఆయన పర్ఫెక్ట్ సెట్ అవుతారని సత్యరాజ్‌ను ఫైనల్ చేశారట. తాజాగా దీనిపై కోలీవుడ్ ఇండస్ట్రీ పీఆర్‌ఓ బాల ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు మోదీ బయోపిక్ కోసం ఓ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
దీనికి విశ్వనేత అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఇక ఈ బయోపిక్‌కి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే త్వరలోనే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ మోదీ బయోపిక్‌కు సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. వందే మీడియా ప్రై.లి పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్నారట. లీడ్ రోల్‌ను 'కట్టప్ప' సత్యరాజ్‌తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, అభయ్ డియోల్, పల్లవి జోషి వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించనున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోయే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాళభైరవ దీనికి సంగీతం అందించనున్నాడని గుసగుస. ఇక ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.