Trinayani serial cast Chandrakanth wife Shilpa sensational comments: పవిత్ర జయరాంతో కలిసి తన భర్త తనను చిత్రహింసలకు గురి చేశాడని, తన జీవితం నాశనం కావడానికి పవిత్రా జయరాం కారణమని 'త్రినయని' ఫేమ్ చందు అలియాస్ చంద్రకాంత్ భార్య శిల్పా జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాగొచ్చి నన్ను కొట్టేవాడు...
నానా విధాలుగా హింసించాడు!
పవిత్ర జయరాం మాయలో పడిన తర్వాత తనను చంద్రకాంత్ పూర్తిగా దూరం పెట్టాడని శిల్ప పేర్కొన్నారు. తనకు పవిత్ర ఫోన్ చేసి 'వాడు నా మొగుడు! నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో' అని కూడా చెప్పింది. ''పవిత్ర జయరాంతో ఎఫైర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చందు తాగి వచ్చి నన్ను కొట్టాడు'' అని శిల్ప చంద్రకాంత్ పేర్కొన్నారు. నానా విధాలుగా హింసించారు.
''ఇంటికి వచ్చినా సరే పవిత్ర జయరాం ఫోటోలు చూస్తూ ఉంటాడు. ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. తనకు అన్నం పెట్టడం లేదని ఆమెతో చెబుతాడు. నా మీద అసత్య ఆరోపణలు చేశాడు. తాగి వచ్చి కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ఎంత ఇబ్బంది పడినా మా అమ్మానాన్నలకు చెప్పలేదు. మా అత్తగారితో నా సమస్యలు చెప్పుకున్నా. నాకు అత్త మామలు ఎంతో సపోర్ట్ చేశారు'' అని శిల్ప ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శాడిస్ట్ కంటే అద్వానంగా బిహేవ్ చేశాడని, తనతో వల్గర్ లాంగ్వేజులో మాట్లాడేవాడిని, అన్నయ్యలతో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగట్టారని కన్నీరు మున్నీరుగా విలపించారు. మానసికంగా, శారీరకంగా తనను వేధించారని శిల్ప బాధపడ్డారు.
పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి వెళ్లాడు!
చందుతో పవిత్ర జయరాం ఎఫైర్ గురించి ఆమె పిల్లలకు కూడా తెలుసునని శిల్ప తెలిపారు. చందుతో సంబంధం పెట్టుకోవడానికి ముందు పవిత్రకు వేరొకరితో పెళ్లి అయ్యింది. ఆ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర కుమారుడితో తాను మాట్లాడే ప్రయత్నం చేశానని శిల్ప తెలిపారు.
Also Read: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప
''నా భర్త మీ తల్లితో సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఇది ఏంటి? అని అడిగితే అవునని పవిత్ర కొడుకు చెప్పాడు. మీ ముందే బెడ్ రూంలోకి వెళుతున్నారా? అని కూడా అడిగా. అవునని చెప్పారు. తమ ముందు బెడ్ రూంలోకి వెళతారని చెప్పారు. 'మాతో ఉన్నారు. అది వాళ్ళిష్టం. వాళ్ళ లైఫ్ మీద మేం అబ్జక్ట్ చెయ్యం' అని చెప్పాడు'' అని శిల్ప వివరించారు.
షూటింగ్ అని ఊటీకి వెళ్లి టార్చర్ చేశారు
పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు షూటింగ్ అని చెప్పి ఆమెతో కలిసి చందు ఊటీ వెళ్లాడని శిల్ప వివరించారు. తనను టార్చర్ చెయ్యడం కోసం అక్కడి నుంచి రోజుకు ఒక రీల్ షేర్ చేసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర జయరాం మరణించిన తర్వాత, పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యాక ఆమె ఇంస్టా అకౌంటులో నాలుగు రీల్స్ పోస్ట్ చేశారని, అవి వైరల్ అయ్యాక డిలీట్ చేశారని ఆమె తెలిపారు.
Also Read: చందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?