Hero Manchu Manoj First Look From Mirai : ‘మిరాయ్’ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో క్రేజీ న్యూస్ వెల్లడించారు. తేజ సజ్జ సూపర్ యోధాగా కనిపిస్తున్న ఈ మూవీలో హీరో మంచు మనోజ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. మనోజ్ పాత్రను రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. మే 20న ‘మిరాయ్’ నుంచి మనోజ్ పాత్రను రివీల్ చేయనున్నట్లు తెలిపారు. మనోజ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్​కు ఇది ట్రీట్ ఇవ్వనుందని చెప్తున్నారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మంచు మనోజ్ సరికొత్త గెటప్ లో ఆకట్టుకున్నారు.  AAA సినిమాస్ వేదికగా  నిర్వహించే వేడుకలో మంచు మనోజ్ పాత్రను గ్లింప్స్ రూపంలో రివీల్ చేయనున్నారు. ఈ సినిమాలో మనోజ్ మాంత్రికుడిగా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో మంచు మనోజ్ తో పాటు మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.  


సూపర్ యోధాగా ఆకట్టుకున్న తేజ సజ్జ


‘మిరాయ్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జ సూపర్ యోధగా కనిపించారు. ప్రీ లుక్ పోస్టర్స్ తో సినీ అభిమానులలో ఇంట్రెస్టింగ్ కలిగించిన మేకర్స్.. గ్లింప్స్ ను సైతం విడుదల చేశారు. సామ్రాట్ అశోక కళింగ యుద్ధ పరిణామాల అనంతరం వచ్చిన 9 గ్రంథాలు, వాటిని తరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధుల గురించి పరిచయం చేస్తూ విడుదలైన ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ లో యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. కళ్లు చెదిరే విన్యాసాలతో తేజ సజ్జ అలరించాడు. సూపర్ యోధుడి పాత్రతో ఒదిగిపోయి కనిపించాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, తేజ సజ్జను చూపించిన విధానం మరో లెవల్ లో అన్నట్లుగా ఉంది.  


‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో ‘మిరాయ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘ఈగల్’ ఫేమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రితిక నాయక్ కథానాయికగా నటిస్తోంది.   






వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ‘మిరాయ్’ విడుదల


ఇప్పటికే ‘మిరాయ్’ మూవీ రివీల్ చేశారు మేకర్స్. 2025 ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తున్నారు.


 


Read Also: కోమా నుంచి వరల్డ్ ఛాంపియన్ దాకా - ఆకట్టుకుంటున్న ‘చందు ఛాంపియన్‌’ ట్రైలర్