Gam Gam Ganesha Release Date: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదట్లో తన సినిమాలు యావరేజ్ హిట్స్‌గా నిలిచినా కూడా ‘బేబి’తో తన కెరీర్ టర్న్ అయిపోయింది. ఈ ఒక్క మూవీ.. తనను టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోల లిస్ట్‌లో నిలబెట్టింది. అయితే ‘బేబి’ రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఆనంద్ తరువాతి మూవీపై ఎలాంటి అప్డేట్ లేదని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆనంద్ దేవరకొండ.. ‘గం.. గం.. గణేశా’ అప్డేట్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు.


రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్..


హై-లైఫ్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న చిత్రమే ‘గం.. గం.. గణేశా’. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత ఆనంద్ దేవరకొండ ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీలపైనే ఫోకస్ పెట్టాడు. కానీ మొదటిసారి ‘గం.. గం.. గణేశా’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌లో మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఆనంద్ కెరీర్‌లో ఫస్ట్ యాక్షన్ మూవీ ఇదే కావడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. మే 31న ‘గం.. గం.. గణేశా’ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.






ఆసక్తికరంగా పోస్టర్..


‘గం.. గం.. గణేశా’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడం కోసం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఆనంద్ దేవరకొండ ఒక కొండ అంచున నిలబడి గన్‌తో కాలుస్తాడు. కానీ ఆ గన్‌లో నుండి బులెట్‌కు బదులుగా గులాబీ రేకులు వస్తాయి. అంతే కాకుండా పోస్టర్‌లో ‘కామెడీ, గందరగోళం, అయోమయం’ అని క్యాప్షన్ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే సినిమా ఏదో ఇంట్రెస్ట్‌గా ఉండేలా ఉందని నెటిజన్లు అనుకోవడం మొదలుపెట్టారు. సరికొత్త కంటెంట్‌తో ఈ సమ్మర్‌లో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి ‘గం.. గం.. గణేశా’తో ఆనంద్ దేవరకొండ సిద్ధమయ్యాడని ఫిక్స్ అయిపోతున్నారు.



కెమిస్ట్రీ బాగుంది..


‘గం.. గం.. గణేశా’లో ఆనంద్ దేవరకొండకు జోడీగా ప్రగతి శ్రీవాస్తవ నటించింది. వీరితో పాటు కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యుయల్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని అర్థమవుతోంది. ఇప్పటికే ‘గం.. గం.. గణేశా’ నుండి బృందావనివే అనే పాట విడుదలయ్యి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఇందులో ఆనంద్, ప్రగతి కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యేలా అనిపిస్తోంది. ఇక మొదటిసారి క్రైమ్ కామెడీ లాంటి డిఫరెంట్‌ జోనర్‌తో ప్రయోగం చేస్తున్న ఆనంద్‌కు ఏ రేంజ్‌లో సక్సెస్ వస్తుందో చూడాలి.



Also Read: ‘ముఫాస: ది లయన్ కింగ్’ ట్రైలర్ వచ్చేసింది - భూమిని కంపించేలా చేసిన ఓ సింహం కథ ఇది