Devara First Single fear song released on the occasion of Jr NTR birthday, Watch lyrical video: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే. 'దేవర' సినిమాలో ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్'ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ సాంగ్ వింటే ప్రతి అభిమానికి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ!


అనిరుద్ అదరగొట్టాడుగా!
'దేవర' సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, మాంచి సింగర్ కూడా! 'ఫియర్ సాంగ్'ను కంపోజ్ చేయడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా పాడారు. ఆయన సంగీతంతో పాటు గాత్రం కూడా సూపర్ అని చెప్పాలి. ఈ పాటను కన్నడ, మలయాళ భాషల్లో సంతోష్ వెంకీ పాడారు. 


'దేవర'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ పాటకు తెలుగులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆల్ హెయిల్ టైగర్ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఆ పాట ఎలా ఉందో మీరూ వినండి.


Also Read: చందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు - పవిత్ర జయరాం అక్రమ సంబంధాలపై శిల్ప




సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్', బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జవాన్'తో పాటు పాన్ ఇండియన్ సెన్సేషనల్ సినిమాలకు అనిరుద్ సంగీతం అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు అతను బాణీలు అందించాలని అభిమానులు అందరూ కోరుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ'కు ఎన్టీఆర్, అనిరుద్ కాంబినేషన్ కుదరాలి. కానీ, వర్కవుట్ కాలేదు. ఇప్పుడీ 'దేవర'తో కుదరడం, ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.


దసరా పండక్కి దేవర ఊచకోత మొదలు!
Devara Release Date 2024: 'దేవర'ను తొలుత ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకోవడంతో పాటు కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లారు. ఇప్పుడు దసరా బరిలో సినిమా విడుదల కావడం గ్యారంటీ. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఎర్రసముద్రం తీరంలో శత్రువుల ఊచకోత, బాక్స్ ఆఫీస్ బరిలో వసూళ్ల వేట మామూలుగా ఉండవని చెప్పారు.


Also Readపిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు



ఎన్టీఆర్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న చిత్రమిది. వాళ్లిద్దరికీ ఇదే తొలి తెలుగు సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, కె హరికృష్ణ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడంతో తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.