Young Tiger NTR Birthday Today: ఎన్.టి.ఆర్. - ఈ పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర ఉంది... ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు. మనవడు, హరికృష్ణ కుమారుడికి తన పేరే పెట్టారు. నటనలో టన్నుల కొద్దీ ట్యాలెంటుతో తాతకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేశారు. మధ్యలో తమిళ, హిందీ సినిమాలతో విజయాలు అందుకున్నా అటు వైపు దృష్టి పెట్టలేదు. పెద్దగా అడుగులు వేయలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది.
'దేవర'కు ముందు ఓ లెక్క... ఇప్పుడో లెక్క!
నటుడిగా ఎన్టీఆర్ ప్రతిభను వేలెత్తి చూపించడానికి లేదు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం 'సింహాద్రి'తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 'రాఖీ, 'యమదొంగ', 'అదుర్స్', 'ఊసరవెల్లి', 'దమ్ము', 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత వీర రాఘవ', 'ఆర్ఆర్ఆర్' - సిల్వర్ స్క్రీన్ మీద నటుడిగా ఎన్టీఆర్ అదరగొట్టిన సినిమాలకు కొదవ లేదు. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ, 'ఆర్ఆర్ఆర్' వరకు ఆయన కెరీర్ అంతా టాలీవుడ్ అన్నట్టు సాగింది. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు.
'స్టూడెంట్ నంబర్ వన్'తో తొలి విజయం, 'సింహాద్రి'తో తొలి ఇండస్ట్రీ హిట్, ఆ తర్వాత 'యమదొంగ'తో తొలి ఫాంటసీ సక్సెస్ ఎన్టీఆర్ అందుకోవడం వెనుక... ఆయనలో టన్నుల కొద్దీ టాలెంట్ బయటకు రావడం వెనుక ఉన్న రాజమౌళి, 'ఆర్ఆర్ఆర్'తో ఇంటర్నేషనల్ గ్రౌండ్ రెడీ చేసి పెట్టాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ ముందున్న టార్గెట్ ఒక్కటే... ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాలి. 'దేవర'కు ముందు ఒక లెక్క... ఎన్టీఆర్ సినిమా తెలుగులో ఆడితే చాలు. అభిమానులకు నచ్చితే మినిమమ్ గ్యారంటీ రిజల్ట్ వస్తుంది. కానీ, ఇప్పుడు లెక్క మారింది. లెక్కలు మార్చాల్సిన టైమ్ ఎన్టీఆర్ (Jr NTR)కు వచ్చింది. తన సినిమా తెలుగులో ఆడితే చాలదు, ఇండియన్ వైడ్ సక్సెస్ కొట్టాలి. కొమురం భీం నటన, నటనలో వేరియేషన్ పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చాలి.
యాక్టింగ్ స్కోప్ ఉండాలే...
ఇండియా అంతా షేక్ అవ్వాలే!
ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆయన్నుంచి కోరుకునేది ఒక్కటే... ఇప్పట్నుంచి చేసే ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ యాక్టింగ్ స్కోప్ ఉన్నది అయ్యి ఉండాలే, ఆల్ ఓవర్ ఇండియా షేక్ చేసే కంటెంట్ ఉండాలే. బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలని టార్గెట్ పాన్ ఇండియాను దాటి ఉండాలని ఆశిస్తున్నారు.
ప్రజెంట్ ఎన్టీఆర్ చేస్తున్న 'దేవర' అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అయితే, స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ 'వార్ 2' స్పై థ్రిల్లర్. ఈ రెండు మూవీస్ డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్. ఇదే విధంగా వేరియేషన్ చూపిస్తూ ముందుకు వెళ్లాలనేది ఫ్యాన్స్ కోరిక.
Also Read: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్
ఎన్టీఆర్ కాంటెంపరరీ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్ సహా ఆయన జూనియర్లు విజయ్ దేవరకొండ, నాని తదితరులు ఆయన కంటే ముందు అదర్ లాంగ్వేజ్ మార్కెట్స్ కన్నేశారు. ఇప్పుడు ప్రతి హీరో పాన్ ఇండియా మూవీ చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతికేళ్లు కంప్లీట్ చేసుకున్నాక ఎన్టీఆర్ తెలుగును దాటి వెళ్లారు. 'ఆర్ఆర్ఆర్'తో ఆయనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. ఇప్పుడు దాని మీద ఎటువంటి బిల్డింగ్ కడతారనేది ఆయన చేతుల్లో ఉంది. ఆకాశమంత ఎత్తున్నది కడతారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. దేశ విదేశాల్లో ఆయన సినిమాల భారీ విజయాలు సాధించాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్!
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం