ఆటోగ్రాఫ్... ఒక్క ఆటోగ్రాఫ్... ఫేవరేట్ హీరో నుంచి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, ఒక్కసారైనా తన అభిమాన కథానాయకుడిని నేరుగా చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో! అందుకోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్ & ప్రెస్ మీట్స్ దగ్గరకు వెళతారు. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకు వేసి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని మరీ ఆ లొకేషన్ దగ్గరకు వెళతారు. కానీ, ఓ ఎన్టీఆర్ అభిమాని వెరైటీగా ఆలోచించాడు. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.


అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం ఆయనకు అలవాటు. ఆయన ఏ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేస్తారనేది చెప్పడం కష్టం ఏమీ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడ ఓటు వేశారో చూస్తే... పోలింగ్ బూత్ వివరాలు తెలుస్తాయి. ఓ అభిమాని ఈ రోజు ఉదయం పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నాడు. ఎన్టీఆర్ ఓటు వేసి వచ్చిన అనంతరం... ''అన్నా! ఆటోగ్రాఫ్'' అంటూ ఆయన వద్దకు వెళ్లాడు.


అభిమాని గుండెలపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశారు. గుండెలపై అంటే గుండెలపై కాదు... షర్ట్ మీద హార్ట్ ఉండే ప్లేసులో సంతకం చేశారు యంగ్ టైగర్. ఆ అభిమానికి ఈ సంతకం ఎప్పటికీ గుర్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా?!


Also Read: టైమ్ చూసి జగన్ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్ - మాస్ రివేంజ్ షురూ!?



ఓటు హక్కు కోసం ముంబై నుంచి వచ్చిన ఎన్టీఆర్!
ఆదివారం రాత్రి వరకు ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన హిందీ సినిమా 'వార్ 2' చిత్రీకరణ చేస్తున్నారు. హృతిక్ రోషన్, ఆయన హీరోలుగా 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) ఫ్రాంచైజీ లోనిది. ఒక వైపు షూటింగ్ బిజీ ఉన్నప్పటికీ... ఓటు హక్కు కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చారు. తన వంతు బాధ్యత నిర్వర్తించారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?


దసరాకు 'దేవర' సందడి షురూ!
Devara Part 1 Release Date: 'వార్ 2' కంటే ముందు 'దేవర'తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. తనకు 'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయం అందించిన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాకపోవడంతో థియేటర్లలో తమ అభిమాన హీరోని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయిట్ చేస్తున్నారు.