List Of Tollywood Celebrities Vote Cast: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిక ఎదురుచూస్తున్న ఆ కీలక ఘట్టం వచ్చేసింది. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. మే 13న ఆంధ్రప్రదేశ్‌ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోలీంగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఎలక్షన్‌ కమిషన్‌.. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది. ఇక నిర్వాహకుల ఈవీఎంలతో తమ తమ కేంద్రాలకు చేరుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ తమ గ్రామాలు తరలి వెళుతున్నారు.


ఇక ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూపు మొత్తం ఏపీపైనే ఉంది. అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగనుంది, రిజల్ట్‌ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ సారి సినీ సెలబ్రేటీలు కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, మెగా ఫ్యామిలీ మొత్తం పవన్‌ కళ్యాణ్‌కు ఇస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఏపీ ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, సెలబ్రిటీలు తమ ఓటు కాస్ట్‌ను ఎక్కడెక్కడ వినియోగించుకోనున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే దాదాపు టాలీవుడ్‌ స్టార్స్‌ అందరికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రేపు జరగబోయే ఓటింగ్‌లో మన టాలీవుడ్‌ స్టార్స్‌ ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు, ఏ హీరో ఏ కేంద్రంలో ఓటు వేయనున్నారనే జాబితా తాజాగా బయటకు వచ్చింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.


రేపు ఓటుహక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్‌ స్టార్స్‌



  • Obul Reddy School - మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌  జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆయన భార్య ప్రణతి, ఎన్టీఆర్‌ తల్లి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు

  • Jubilee Hills Public School - మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ , హీరో శ్రీకాంత్‌, ఆయన భార్య ఊహా ఓటు వేయనున్నారు

  • BSNL Centre, Jubilee Hills -  అల్లు అర్జున్, స్నేహారెడ్డి , అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

  • Jubilee Hills Club -  చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌లు ఓటు వేయబోతున్నారు (మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల ఓటింగ్‌ కూడా ఇక్కడే ఉన్నట్టు సమాచారం)

  • Film Nagar Cultural Centre (FNCC) - డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ , విశ్వక్‌సేన్‌ , దగ్గుబాటి రానా, సురేశ్‌ బాబు

  • Jubilee Hills New MP, MLA Colony - మాస్‌ మహారాజా రవితేజ 

  • Working Women’s Hostel - నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఇతర అక్కినేని ఫ్యామిలీ సభ్యులు

  • Manikonda High School -  వెంకటేశ్, బ్రహ్మానందం 

  • Shaikpet International School - రాజమౌళి రామారాజమౌళి 

  • Banjara Hills MLA Colony -  హీరో రామ్ పోతినేని 

  • Gachibowli ZP School - హీరో నాని ఓటు వేయనున్నారు 

  • Film Nagar Cultural Centre (FNCC) -  హీరో సుధీర్ బాబు 

  • Road No 45, Jubilee Hills – Financial Cooperative Society - హీరో అల్లరి నరేశ్‌

  • యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: నటుడు తనికెళ్ల భరణి